టీమ్ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ (210: 134 బంతుల్లో) బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఏకంగా రికార్డు డబుల్ సెంచరీ బాదేశాడు. ఇలా భారత్ తరఫున ద్విశతకం బాదిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్ కావడం విశేషం. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి.. ఇప్పటి వరకు క్రిస్ గేల్ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఇషాన్ ఇన్నింగ్ లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లు వున్నాయి.
మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మరో సెంచరీ బాదాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 72వది కాగా.. వన్డేల్లో 27వ శతకం. ఈ మ్యాచ్ లో టీమ్ఇండియా వన్డేల్లో ఆరోసారి 400 మార్క్‌ను తాకింది. టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై ఇదే భారత్‌కు అత్యధిక స్కోరు. అంతకుముందు 370/4 స్కోరే అత్యధికం.