కడపలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ కు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే… ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ భద్రతతో సోదాలు చేపట్టారు. ఈ సంస్థపై ఐటీ సోదాలు జరపడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతుంది. దీనికి కారణం ఈ సంస్థ సీఎం జగన్ రెడ్డి బినామీన్న అభిప్రాయం బలంగా ఉండటమే.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ గురించి గత నాలుగేళ్లలో ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.. సాదాసీదా ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీ అయిన ఆ సంస్థ.. . గత నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడనికి సిద్దమయింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న సంగతి పక్కన పెడితే.. ఆ సంస్థ మూలాలు మొత్తం పులివెందుల, తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, భూములు అన్నీ ఇష్టారాజ్యంగా ఆ సంస్థకు కట్టబెడుతూ వస్తున్నారు. జగన్ రెడ్డి బినామీ కంపెనీ కాబట్టే.. ఇలా కట్టబెడుతున్నారని టీడీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది.
షిరిడి సాయి సంస్థ యజమాని విశ్వేశ్వర్ రెడ్డి జగన్, అవినాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ కంపెనీ ఏపీలో మాత్రమే లక్షల కోట్లు పెట్టుబడులు.. భూములు.. అంటూ.. రచ్చ చేస్తోంది. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులు కూడా పొందుతోంది. అసలు ఆ సంస్థకు ట్రాన్స్ ఫార్మర్ల తయారీలోనూ గొప్ప ట్రాక్ రికార్డు లేదు.
ఈ సంస్థ పై ఐటీసోదాలు ఎందుకన్న చర్చ ఇప్పుడు ప్రారంభమయింది. జగన్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలియడంతో… హెచ్చరికగా శాంపిల్ గా ఈ ఐటీ దాడులు చేస్తున్నారన్న సందేహాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. లేకపోతే.. మరో రాజకీయ కారణం ఏమైనా ఉందా అని చర్చించుకుంటున్నారు. ముందు ముందు ఐటీ దాడులు జరిగే తీరుపై తదుపరి పరిణామాలను అంచనా వేయవచ్చని భావిస్తున్నారు.