మొన్న పులి సినిమాను షేక్ చేసి షాక్ లో ముంచిన ఆదాయ పన్ను శాఖ ఈరోజు చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమా మీద కూడా పడ్డారని ఉదయం నుండి ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ ప్లే చేస్తుండటం హాట్ న్యూస్ గా మారింది. న్యూస్ ఛానెల్ చేసిన ప్రసారాల ప్రకారం బ్రూస్ లీ సినిమా నిర్మాత దానయ్య, దర్శకుడు శ్రీనువైట్ల, మ్యూజిక్ డైరక్టర్ థమన్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇళ్ల మీద ఆఫీసుల మీద ఐటి శాఖ అధికారులు దాడి జరిపారట.
రీసెంట్ గా పులి రిలీజ్ కు ముందు రోజు కూడా ఇలాంటి దాడులే జరిపి సినిమా రిలీజ్ ని కూడా రెండు రోజులు ఆపేశారు. మరి బ్రూస్ లీకి కూడా అదే పరిస్తితి పడుతుందా లేదా అన్నది నైట్ కల్లా తెలుస్తుంది. ఐటి షాక్ ఇచ్చిన షాక్ లో ఉన్న బ్రూస్ లీ టీం తర్జన భర్జనలో ఉందని వినికిడి. మరి అసలు ఇంత సడెన్ గా ఐటి అధికారులు ఎందుకు బ్రూస్ లీ టీం మీద రైడ్ కి వెళ్లారో తెలియాలి.
రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా ఒకవేళ రేపు రిలీజ్ అవ్వడం కుదరకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి నైట్ కల్లా అసలు పరిస్తితి ఏంటి అనేది తెలుస్తుంది.