సీబీఐ కావాలంటారు.. . దర్యాప్తు చేస్తే దర్యాప్తు అధికారిపై ఫిర్యాదులు చేస్తారు. ఆ దర్యాప్తు అధికారిని మార్చాలంటారు. మారిస్తే.. మళ్లీ వారంతా కుట్రదారులంటారు. కొత్తగా ఎవరు వచ్చినా సరే తాము చెప్పే వాదనను బలపరిచే దర్యాప్తు సంస్థ మాత్రమే ఖచ్చితం. నిజాల్ని బయటకు తీసేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు ప్రభావితమే అని వాదిస్తారు. కోడికత్తి కేసులో … కోర్టుకెళ్లి… కేంద్రం వద్ద తమకున్న పలుకుబడి ఉపయోగించుకుని ఎన్ఐఏ దర్యాప్తు వేయించుకున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులోనే లోపాలు వెదుకుతున్నారు.
ఏ దర్యాప్తు సంస్థపై నమ్మకముంది సారూ !
కళ్ల ముందు కనిపించే నిజాల్ని కూడా అబద్దాలుగా నమ్మించేందుకు వైసీప చేసే ప్రయత్నాలు రియలిస్టిక్ గా ఉండవు. ఏం జరిగినా చంద్రబాబు అని అనడం అలవాటైపోయింది. అధికారంలో ఉన్నా.. అడ్డగోలుగా దొరికిన వారిని కాపాడటం కష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం ఉండదు. అధికారంలోకి వచ్చాక సీబీఐపై నమ్మకం ఉండదు… ఎన్ఐఏపై నమ్మకం ఉండదు. కోర్టులపై నమ్మకం ఉండదు. తాము చెప్పినట్లుగా చేయకపోతే.. వారంతా కుట్రదారులేనని ఆరోపించడానికి బరితెగింపు మాత్రం ఉంటుంది.
తాము చెప్పింది ఒప్పుకుంటేనే మంచి దర్యాప్తు సంస్థనా ?
అటు వివేకా హత్య కేసులో కానీ…. ఇటు కోడికత్తికేసులో కానీ తాము మంచి వాళ్లమని తమ ప్రత్యర్థులే కుట్రదారులని … తాము చెబుతూ సాక్షిలో రాయిస్తున్న వాటిని బలపరిస్తే మాత్రమే… ఆయా దర్యాప్తు సంస్థలు కరెక్ట్ లేకపోతే…. వాటిని ఎవరో ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడం కామన్ గా మారిపోయింది. సీబీఐ..సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్… తర్వాత వచ్చిన చౌరాసియా.. ఇలా అందరిపై నిందలేసుకుంటూ పోతున్నారు. చివరికి ఎన్ఐఏపైనా నిందలేస్తున్నారు. ఇలాంటి కేసుల్ని ఎన్ ఐఏ విచారణ చేపట్టదు. కానీ వైసీపీ, జగన్ కోరిక మేరకే కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఎన్ ఐఏ విశ్వసనీయతనూ ప్రశ్నిస్తున్నారు.
చేసేది తప్పుడు పనులు… ఇతరులపై రుద్దడానికి దబాయింపులు !
చేసేది తప్పుడు పనులు. అది కూడా అడ్డంగా దొరికిపోయి. అయినప్పటికీ.. ఆ పనుల వల్ల ఎవరు బాధితులైతే వారినే.. నేరస్తులుగా మార్చాలనే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. గతనాలుగేళ్లుగా టీడీపీ నేతలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టిన రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసే దర్యాప్తుల్లోనూ చేయడం ఎలా సాధ్యమవుతుంది. తమ చేతుల్లో ఉన్న పోలీసు వ్యవస్థతో అరాచకం రాజ్యమేలేలా చేశారు. దాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు కొనసాగిస్తాయి.