నన్ను సీఎంను చేయాలని లేదా అంటూ విశాఖ నేతలపై జగన్ రెడ్డి అలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను చెప్పిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పని చేయడం లేదని.. తనను సీఎంను చేయాలని మీకు లేదని … విమానాశ్రయంలో తనకు బోకేలు ఇచ్చేందుకు వచ్చిన వారిపై ఆయన విరుచుపడినంత చేయడం… దాన్ని వైసీపీ వాళ్లే రికార్డు చేసి… ఇంత బేలగా ఉన్నాడేంటి అనుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిపోయాయి. జగన్ రెడ్డి ఎప్పుడూ తన సీఎం సీటు గురించే ఆలోచిస్తారు. అందులో సందేహం లేదు. కానీ… ఇక్కడ విషయం ఏమిటంటే.. . తనను తాను సీఎంను చేసుకున్నానని అనుకునేవారు ఇప్పుడు… తనను ఇతరులు సీఎం చేయాలని అనుకుంటున్నారు.
జగన్ రెడ్డి తన పార్టీపై… మంత్రులపై పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన మంత్రులతో చిట్ చాట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. అక్కడ మాట్లాడినవన్నీ మీడియాకు తెలుస్తున్నాయని అందుకే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ఓ ముఖ్యమంత్రి తన కేబినెట్ పై పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోవడం అనేది… జస్ట్ జగన్ రెడ్డి ధింగ్స్ అని వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది. అందరూ కోవర్టులేనని వైసీపీ పరిస్థితి బాగోలేదని.. సేఫ్ గా అందరూ టీడీపీ, ఆ పార్టీ సన్నిహితులతో టచ్ లోకి వెళ్లారని జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే … మంత్రుల్నీ నమ్మలేకపోతున్నారు.
151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిలో ఇంత ఘోరమైన పతనం చూస్తామని వైసీపీ నేతలూ అనుకోలేకపోతున్నారు పాలన వైఫల్యాలను పక్కన పెట్టినా.. సొంత పార్టీ విషయంలో … పార్టీ నేతల విషయంలో ఆయన నమ్మకం కోల్పోవడం అంటే… ఇక ఇప్పుడల్లా కోలుకునే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారి కంటే పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధన్యం ఇస్తానని చెబుతున్నారు. కానీ ఇంతకు ముందు మొహమాటాలేమీ లేవని.. ఎవరు గెలుపు గుర్రం అయితే వారికే టిక్కెట్లు ఇస్తానని చెప్పుకొచ్చేవారు. మొత్తంగా జగన్ రెడ్డిలో కనిపిస్తున్న స్పష్టమైన బేలతనంతో… ఆయన అధికారాన్ని చూసి ఎగిరెగిరిపడిన వారికి గుండెలు జారిపోతున్నాయి. తాము చేసిన నిర్వాకాలతో అధికారం కోల్పోయిన తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడ కష్టమని కంగారు పడుతున్నారు.