నాకు అబద్దాలడటం రాదు అన్న నోటితేనే సీఎం జగన్ తనకు పేపర్లు లేవు.. టీవీలు లేవు అని చెప్పుకుంటూ ఉంటారు. మొదట చెప్పిన మాటకు.. తర్వాత చెప్పిన మాటలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? . తనకు ఉన్న వాటిని కూడా లేవని చెప్పుకుని.. తాను అబద్దాలు ఆడను అంటే.. జనం దేంతో నవ్వుతారో తెలియదా ? అన్నీ తెలిసినా సరే … నిజం అని నమ్మించడానికి జగన్ తంటాలు పడుతున్నారు. అడ్డగోలుగా బహిరంగసభల్లో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నారు. అబద్దమైన వంద సార్లు చెబితే ప్రజలు నిజం అని నమ్ముతారని ఆయన గట్టి నమ్మకమని ఆయన చెప్పే మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
గతంలో తాను చెప్పిన అబద్దాలు.. ఫేక్ ప్రచారాలను జనం నమ్మారని.. ఇది మాత్రం ఎందుకు నమ్మరన్నట్లుగా ఆయన వ్యవహరశైలి ఉంది. మీడియా ఉండటం తప్పు కాదు. అది ఆయన మీడియా అని అందరికీ తెలుసు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ సోషల్ మీడియా గురించి కూడా తనది కాదని చెప్పుకున్నారు. ఇంత దారుణంగా అబద్దాలు చెప్పే సీఎం… తనవి అయినా తనవి కావని చెప్పి ప్రజల్ని ఏ మార్చే సీఎంను గతంలో ఎవరూ చూసి ఉండరు. ప్రజలు కూడా.. ఇలా ఎలా చెబుతారబ్బా … అని ఆశ్చర్యపోయేంతగా ఆయన అబద్దాలు ఉంటున్నాయి. ఎందుకంటే.. అవన్నీ నిజాలని కళ్ల ముందు కనిపిస్తున్నాయి మరి.
వైసీపీ పూర్తిగా ఫేక్ పార్టీగా మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతీది ఫేక్ చేయడమే పనిగా ఆ పార్టీకి ఉంది. ప్రత్యర్థుల్ని ఫేక్ చేయడం వేరు..తమను తాము ఫేక్ చేసుకోవడం వేరు. ఇప్పుడు తమను తాము ఫేక్ చేసుకోవడంలో నూ వైసీపీ.. ఆ పార్టీ అధినేత రాటుదేలిపోయారు. ఎక్కడా తగ్గడం లేదు గుడ్డిగా నమ్మతున్న జనమే తమ బలం అని వారి నమ్మకం. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దీని పర్యవసానాలు గట్టిగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.