ఏపీలో అంగన్వాడి టీచర్ల సమ్మె చర్చనీయాంశమవుతోంది. వారి డిమాండ్ల కన్నా వారిపై తన ప్రతాపం చూపాలని అనుకుంటున్న సీఎం జగన్ తీరే ఎక్కువ చర్చనీయాంశమవుతోంది. వారు అంగన్వాడి టీచర్లు. చిన్న పిల్లలను చూసుకుంటారు. నిరుపేద భావి పౌరుల ఆరోగ్యాన్ని కాపాడతారు. వారికి పాదయాత్రలో జగన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. తల మీత చేయి పెట్టి లెక్క లేన్నికబుర్లు చెప్పారు. తాను వస్తే మీ బతుకు బంగారమేనని నమ్మించారు. ఆయన వచ్చారు.. ఐదేళ్లయింది..కానీ వారి బతుకు దుర్లభమయింది. విషయం అర్థమయ్యి.. రోడ్డెక్కిన వారికి.. నాడు తన తలపై చేయి పెట్టిన లీడర్.. నేడు పోలీసు ఇనుపబూట్ల కింద తొక్కించేయాలని ఆదేశించారు. వారికి తత్వం బోధపడింది.
అంగన్వాడిల సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మొత్తం ప్రభుత్వ బలాన్ని వారిపై ప్రయోగిస్తున్నారు. పోలీసులతో అణిచి వేస్తున్నారు. అంగన్ వాడి సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి సచివాలయ ఉద్యోగులతో తెరిపిస్తన్నారు. వారి డిమండ్లపై కనీస సానుభూతి చూపకపోగా.. ప్రభుత్వ బలం మొత్తం ప్రయోగించడం వివాదాస్పమవుతోంది. అయితే ఎంత వేధించినా తగ్దేది లేదన్నట్లుగా అంగన్వాడిలు పోరాడుతున్నారు. మాట తప్పిన వాడిపై ఎంతకైనా తెగించి పోరాడతామని అంటున్నారు.
ఐదేళ్లలో జగన్ రెడ్డి సర్కార్ అంగన్ వాడిలకు ఒక్క వెయ్యి రూపాయలు పెంచింది. కానీ ఏడు వేలు పెంచామని ప్రచారం చేసుకుంటోంది. ఎంత ప్రచారం చేసుకున్నా.. నిజంగా తీసుకునేవారికి తెలియదా ?. ఆ ఒక్క వెయ్యి పెంచినందుకు వారికి ఎన్ని రకాల స్కీములు ఆపేశారో చెప్పాల్సిన పని లేదు. అసలు కన్నా నష్టం ఎక్కువ చేశరు. ఇన్నాళ్లూ ఓపిక పట్టిన వారు ఇక ఆగడం లేదు. తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అందుకో రోడ్డెక్కారు. మహిళలే కదా వారిని అణిచి వేయడానికి ఏమైనా చేయవచ్చని అసాధారణ అణిచివేతకు ప్రయత్నిస్తున్నాడు పాలకుడు. ఇది ఆయన మానసిక స్థితిని చూపిస్తోందని.. ఆయన పూర్తిగా విచక్షణ కోల్పోయారన్న వాదన వినిపిస్తోంది.