పులివెందుల ఎమ్మెల్యే జగన్ పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నాన్నాళ్ళు కొంతమంది నేతల మాటలను నమ్మి ఇష్టారీతిన పాలన కొనసాగించి పవర్ కోల్పోయిన జగన్..ప్రతిపక్షంలోనూ అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఓ కాల్పనిక కాలంలో జగన్ తేలియాడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే పథకాలను అమలు చేసేవాళ్లమని , చంద్రబాబు అధ్గికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. అందుకే కూటమి సర్కార్ పై వ్యతిరేకత వచ్చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్ కు తప్ప ఆ పార్టీ నేతలకూ కనిపించడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు పెండింగ్ హామీలను నెరవేర్చేలా ఆయన రెండు నెలల పాలన సంకేతాలను ఇచ్చింది.
చంద్రబాబు పాలన ఏపీ ప్రజలకు ఓ కొత్త ఆశను రేకెత్తిస్తోంది. గత ఐదేళ్లలో ఏం కోల్పోయామో తెలియజేస్తోంది. అయినా, జగన్ మాత్రం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్ళపాటు పరదాల మాటున తిరిగి వాస్తవాలను గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిన జగన్ ను , నిత్యం ప్రజల్లో ఉండే కింది స్థాయి నేతలు నమ్ముతారా? అంటే కష్టమే.
అయితే, పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ వైసీపీని ఎవరూ వీడకుండా చేయడం కోసమే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందంటూ జగన్ కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.