వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్‌కు బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఏమీ లేని ఏపీలో ఎవరు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఓకే. ఓకటీ అరా సీట్లు ఇచ్చినా .. వచ్చినా చాలు. అదే సమయంలో వైసీపీ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే.. వైసీపీ డీఎన్ఏ కాంగ్రెస్ అని.. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయ వ్యూహాలను ఖరారు చేసే పీకేనే కాంగ్రెస్ పార్టీకి ఈ సలహా ఇచ్చారు.
పీకే సిఫార్సుపై వైసీపీ ఉలిక్కి పడలేదు. ఆశ్చర్యపోలేదు. ఖండన దండనలు రాలేదు. సహజంగా అయితే పీకేపై వైసీపీ సోషల్ మీడియా బూతులతో విరుచుకుపడాలి. కానీ సంయమనం పాటిస్తోంది. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదని వారికి తెలుసు. ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారికే మద్దతన్నారు. పీకేతో చాలా కాలం డీల్ చేసింది విజయసాయిరెడ్డే. అక్కడ ఎలా ఉంటుందో అయనకు తెలుసు.
ఇప్పుడు వైసీపీ తీరుపై బీజేపీలోనూ అనుమానం ప్రారంభమయినట్లుగా కనిపిస్తోంది. జగన్ కు కేసులే ముఖ్యం. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి మద్దతు ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. బీజేపీతో అంట కాగుతూ ఇంత కాలం కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు సైలెంటవుతున్నారు. ఇది కూడా బీజేపీ అగ్రనేతలకు వేరే సంకేతాలు పంపుతున్నాయి. పీకే రిపోర్టుపై వైసీపీ అధికారంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో.. బీజేపీ నేతలుకూడా అనుమానిస్తున్నారు.
తెర వెనుక వైసీపీ ఏదో రాజకీయం చేస్తోందని నమ్ముతున్నారు. అందుకే ఇటీవల .. అంత గొప్పగా సంబంధాలు ఉన్నట్లుగా కనిపించడం లేదంటున్నారు. పీకే ద్వారా కాంగ్రెస్‌తో వైసీపీ సంప్రదింపులు నిజమే అయితే.. బీజేపీ జగన్‌ను అంత తేలికగా వదిలి పెడుతుందా అన్నది చాలా మందికి వస్తున్న సందేహం.