జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన అంటే లండన్ అంటారు. ఎందుకో వారికే తెలియాలి. ఆయన సీఎం అయినప్పుడు కుమార్తె ఫ్రాన్స్ లో చదివారు. కానీ లండన్ వెళ్లారు. చంద్రబాబును అరెస్టు చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన లండన్ టూర్ కు వెళ్లారు. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో.. ఎవరికీ తెలియదు. చిన్న ఫోటో కూడా బ యటకు రానివ్వలేదు. కానీ ఈ సారి మాత్రం.. స్పెషల్ ఫ్లైట్ లో దిగినప్పటి నుండి లగ్జరీని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసుకుంటూ… అక్కడ కూడా తమ ఆర్టిస్టులు ఉన్నారని నిరూపించుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఈ టూర్ కోసం చేస్తున్న ఖర్చు .. పెట్టుకుంటున్న బిల్డప్ అంతా ఇంతా కాదు. లండన్ లో ప్రైవేటు విమానాశ్రయంలో దిగడానికే చాలా ఖర్చు అవుతుంది. అక్కడ ఉండే సెటప్.. కార్లు అన్నీ అత్యంత ఖరీదైన ఏర్పాట్లే. సెక్యూరిటీని కూడా ఇక్కడ్నుంచే తీసుకెళ్లారు. అక్కడ జనం పట్టుమని పది మంది లేకపోయినా… ఉన్నట్లుగా కేకలతో వీడియోలు రిలీజ్ చేయించుకున్నారు. గతంలో ఎందుకు ఇలాంటి సెటప్ ఏర్పాటు చేసుకోలేదనేదే ఇక్కడ డౌట్.
ప్రైవేటు విమానాశ్రయం బిజీగా ఉండటంతో… ముందుగా ల్యాండింగ్ అనుమతి రాకపోవడంతో అమ్ స్టర్ డ్యామ్ కు విమానాన్ని మళ్లించారు. ఐదు గంటలు ఆలస్యంగా లండన్ వచ్చారు. గతంలో విమానాశ్రయంలో ఎప్పుడు దిగారో కూడా ఎవరికీ తెలియదు. ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండే అవకాశం లేకపోవడం… సీక్రెట్ గా ఉండే ఆయన పరారీలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుందన్న కారణంగా ఇలాంటి హడావుడి ఏర్పాటు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.