మంత్రి విశ్వరూప్ ఫ్యామిలీలో జగన్ రెడ్డి టిక్కెట్ చిచ్చు పెట్టేశారు. ఈ సారి విశ్వరూప్ కు టిక్కెట్ లేదని ఆయన కుమారుడు శ్రీకాంత్ కు చాన్సిస్తామని తాడేపల్లి నుంచి లీకులు వచ్చాయి, అయితే తానే పోటీ చేస్తానని విశ్వరూప్ ప్రకటించారు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. విశ్వరూప్ ఫ్యామిలీలో మొదటి నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన ఓ కుమారుడి పేరు కృష్ణారెడ్డి.. మరో కుమారుడు పేరు శ్రీకాంత్. ఇద్దరూ రాజకీయంగా తిరుగుతూ ఉంటారు. ఎవరికి అవకాశం కల్పించాలన్నది కుటుంబంలో తేల్చుకోలేకపోయారు.
కోనసీమలో ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు ఓ కుమారుడు కృష్ణారెడ్డి అనేక మందిని బెదిరించి వార్తల్లోకి వచ్చారు. అప్పుడు ఆయన తన తండ్రి గురించి కాకుండా.. తల్లి గురించి ఎక్కువ బాధపడ్డారు. తన తల్లి ఇంట్లో ఉంటే దాడి చేస్తారా.. మీ సంగతి చూస్తానని దాడిలో పాల్గొన్న పార్టీ నేతలపై విరుచుకుపడేవారు. ఆ ఇష్యూ తర్వాత విశ్వరూప్ అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలో చాలా కాలం ట్రీట్ మెంట్ తీసుకున్నారు. తర్వాత కోలుకున్నా అంత చురుకుగా లేరు. ఈ క్రమంలో ఆయన వారసుల పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ ఎవరు వారసుడు అన్నదానిపైనా కుటుంబంలో తేడాలున్నాయి. అదే సమయంలో శ్రీకాంత్ కు అవకాశం కల్పిస్తే.. కుటుంబం చీలిపోతుంది. అందుకే కష్టమైనా. .శ్రీకాంత్ కాదని తానే పోటీ చేస్తానని విశ్వరూప్ చెబుతున్నారు. కానీ తాడేపల్లి ఆఫీస్ నుంచి మాత్రం… శ్రీకాంత్ పేరును పదే పదే ప్రచారంలోకి తెస్తున్నారు.