సాక్షి పత్రిక – రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో ఒక్క సారిగా మీడియా రంగం లోకి బాణం లా దూసుకు వచ్చిన పత్రిక. వచ్చీ రాగానే అప్పటి దాకా ఉన్న పత్రికలకి ఆల్ మోస్ట్ దడ పుట్టించేసింది. 2 రూపాయలకే పత్రిక ఇవ్వడం, అదీ ఫుల్ కలర్ పేజీ లతో పత్రికని నడపడం, వీటన్నింటికి మించి ‘అన్ని పత్రికలు 2 రూపాయలకే ఇవ్వాలి ‘ అంటూ సాక్షి లో ఒక “ఉద్యమం” నడపడం – ఇవన్నీ మిగతా పత్రికలకి కంటి మీద కునుకు లేకుండా చేసాయి.
వీటి తో పాటు, జగన్ పార్టీ పెట్టినపుడు సాక్షి పత్రిక, సాక్షి ఛానెల్ ద్వారా జగన్ పార్టీ కి లభించిన మైలేజ్ కూడా చాలా ఎక్కువే. మిగతా పత్రికల్లో వైకాపా గురించి వ్రాసినా, వ్రాయకపోయినా జగన్ అప్పట్లో పెద్దగా పట్టించుకున్నది లేదు. తమ ధోరణి లో తాము ఉండేవారు. 2011 లో వైకాపా ని ప్రారంభిస్తే, 2011 డిసెంబర్ ఆఖరున ఈ ఏటి టాప్ 10 ప్రముఖులు (ప్రపంచ వ్యాప్తంగా) అంటూ ఒక ఆర్టికల్ వ్రాసినపుడు, 8 వ స్థానమో, 9 వ స్థానమో (ప్రపంచ వ్యాప్తంగా) జగన్ కి ఇచ్చింది సాక్షి. అత్యంత పెద్ద డెమొక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో అత్యంత పవ ఫుల్ అయిన సోనియా ఢీ కొట్టినందుకు ప్రపంచ వ్యాప్త ప్రముఖ్ల లిస్ట్ లో జగన్ కి స్థానమిచ్చింది సాక్షి. అంతలా ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్ టైప్ లో ఉన్న జగన్, ఇప్పుడు తమ స్వంత ఛానెల్ సాక్షి మీద మాత్రమే ఆధార పడటం తగ్గించేస్తున్నాడు. రామోజీ సహా అన్ని మీడియాలని తన పాద యాత్రకి కవరేజ్ ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ మీడియా అధిపతులు అపాయింట్ మెంట్ ఇవ్వక పోతే, వేర్వేరు మార్గాల ద్వారా అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు.
ఇవన్నీ చూస్తుంటే తన రాజకీయ మనుగడ కి సాక్షి ఒక్కటే సరిపోదు అని జగన్ రియలైజ్ అయినట్టే కనిపిస్తోంది. ఈ రియలైజేషన్ మంచిదే కానీ ఒకప్పుడు, అంటే తాను పై చేయి గా ఉన్నపుడు – మిగతా మీడియా ఛానెళ్ళ అస్తిత్వాలనే దెబ్బ తీసే తరహా లో “ఉద్యమాలు నడపడం”, ఆ పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ ని సాక్షి ఏకి పారేసి వాటి విశ్వసనీయతని దెబ్బతీసేలా వ్యవహరించిన జగన్ ఇప్పుడు అవే మీడియ పత్రికలు ఛానెళ్ళ మద్దతు కోరడం బహుశా విధి విచిత్రం!!!