సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండి.. హఠాత్తుగా ఆయన అమరావతికి ఫోన్ చేసి ఏడో తేదీన కేబినెట్ ఫెట్టండి అని ఆదేశించారు. సహజంగా ఏదో ఉందిలే అనుకుంటారు. కానీ జగన్ కేబినెట్ నిర్ణయంపై అసలు ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రి చాలా కీలక నిర్ణయాల గురించి ప్రకటించినా.. అవి అమలు చేస్తారనే నమ్మకం అధికారయంత్రాంగంతో సహా ఎవరికీ లేకపోవడంతో అంతా లైట్ తీసుకుంటున్నారు. ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా జీపీఎస్ అనే విధానాన్ని అమలుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీపీఎస్ రద్దు చేసేశామని ప్రచారం ప్రారంభించేశారు. నిజానికి సీపీఎస్ రద్దు చేసే పని అయితే ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పేవారుగా..కానీ ప్రచారం మాత్రం అలా పీక్స్ కు చేరిపోయింది.
ఇక ఉద్యోగులకు సంబంధించి..డీఏలు.. పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ.. ఇలా చాలా నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అన్నీ.. డొల్లేనని అమలు చేసేదేమీ ఉండదని ఇప్పటి వరకూ తీసుకున్న కొన్ని వందల నిర్ణయాల్లో స్పష్టమయింది. అందుకే ఎవరూ ఎగ్జయిట్ కాలేదు. ఇలా ఎగ్జయిట్ కావడానికి కూడా ముందే కొంత మంది పెయిడ్ ఆర్టిస్టుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. వారిలో వెంకట్రామిరెడ్డి ఒకరు. ఆయన ముందే రాసి పెట్టుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఇలా కేబినెట్ భేటీ ముగిసిందని తెలియగానే ఇలా .. ఆహా సీఎం.. ఓహో సీఎం అని పొగిడేసి వెళ్లిపోయారు.
కేబినెట్ భేటీలో జగన్ తీరు పూర్తిగా ఆత్మవిశ్వాసం లోపించినట్లుగా ఉందని మంత్రులు గుసగులలాడుకున్నారు. ఎప్పుడు కేబినెట్ సమావేశాలు జరిగినా మంత్రులకు జగన్ వార్నింగ్ లు ఇచ్చేవారు. ఈ సారి అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. గతంలో ముగ్గురు, నలుగురు మంత్రుల్ని మార్చేస్తానని చెప్పేవారు. కేబినె్ట విస్తరణ కూడా ఉంటుందని అనుకున్నారు.కానీ ఈ సారి మాత్రం మంత్రులు ఎవర్నీ మందలించలేదు. పైగా తొమ్మిది నెలలు కష్టపడాలని బతిమాలుకున్నారు. తొమ్మిది నెలలు కష్టపడితేనే గెలుస్తామని.. వేడుకున్నంత పని చేశారు.
పనిలో పనిగా చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో ఎవరూ స్పందించవద్దని సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే ఎక్కువగా స్పందించడంతో వారే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వినిపించడంతో ఇక స్పందించవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.