వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇద్దరూ ఈ రోజు ప్రచారానికి విరామం ఇచ్చారు. ఇద్దరివీ వేర్వేరు కారణాలు. జగన్మోహన్ రెడ్డి… ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని..ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఉదయం పంచాంగ శ్రవణం విని.. మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిన్న అస్వస్థతకు గురయ్యారు. తీరిక లేకుండా ప్రచారం చేయడంతో వడదెబ్బ తగిలిదింది. అదే సమయంలో… ఓ అభిమాని కాళ్లు పట్టుకుని.. లాగి కింద పడేశారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి… కాస్త తెరిపిన పడిన పవన్ .. డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ప్రచారానికి మాత్రం ఈ రోజు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం… తన ప్రచార షెడ్యూల్‌ను అలా కొనసాగిస్తున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన ప్రచారం ప్రారంభమవుతుంది. సాయంత్రం పది గంటల వరకూ.. షెడ్యూల్ ప్రకారం… ప్రచారం చేస్తూనే ఉంటారు. రోడ్ షోలు నిర్వహిస్తూనే ఉంటారు. ఉగాది రోజు కూడా ఆయన సెలవు తీసుకోవడం లేదు. ఐదారు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే ఆయన… అభ్యర్థుల కసరత్తు దగ్గర్నుంచి.. పార్టీ వ్యవహారాలన్నింటినీ రేయింబవళ్లూ కష్టపడి చక్కబెట్టుకున్నారు. ప్రచారం ప్రారంభమైన తర్వాత ఒక్క రోజు కూడా విరామం ఇవ్వలేదు.
అసలే మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అంతంతమాత్రంగానే… సమయం ఉంది. అయినా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి… పది రోజుల వ్యవధిలో మూడు రోజులు విరామం తీసుకున్నారు. రెండు రోజులు.. లోటస్‌పాండ్‌లో… పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఓ సెలవు తీసుకున్నప్పుడు ఇంటలిజెన్స్ డీజీని.. మరోసారి సెలవు తీసుకున్నప్పుడు… ఏకంగా సీఎస్‌ను.. ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ సారి ఉగాది కాబట్టి.. విరామం ఇచ్చినట్లు జగన్ ప్రకటించారు. ఇక మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచార గడవు ఉంది. అంటే.. నికరంగా… రెండున్నర రోజులు మాత్రమే ప్రచార గడువు ఉంది.