కొంత మందికి కొన్ని రకాల పనుల ద్వారా ఆనందం వస్తుంది. ఏపీ సీఎం జగన్ రెడ్డికి ఎవరైనా టెన్షన్ తో చచ్చిపోతూంటే.. భయపడిపోతూంటే… చూసి ఆనందించాలని ఉంటుందన్న విమర్సలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు.. ప్రజల్ని ఇంత కాలం అలా టార్చర్ పెట్టిన ఆయన ఇప్పుడు సొంత నేతలపై పడ్డారు. టిక్కెట్ల కసరత్తు పేరుతో వారంతా టెన్షన్ పడుతూ.. తన ఇంటి ముందు పడిగాపులు పడటం ఆయనకు చాల ఆనందంగా ఉంది. అందుకే ఈ కసరత్తును అదే పనిగా కొనసాగిస్తున్నారు. అందరూ టిక్కెట్ల టెన్షన్ తో ఉంటే తాను మాత్రం హాయిగా నవ్వుకుంటున్నారు.
జగన్ రెడ్డి వ్యవహారశైలి వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్యేలను ఆయన పెడుతున్న టార్చర్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కనీసం గౌరవం లేకపోవడంతో వారు ఆవేదనతో వీడియోలు పెడుతున్నారు. తర్వాత వారికి వచ్చే బెదిరింపులతో మళ్లీ తాను అలా అనలేదని మళ్లీ వీడియోలు ఇస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చిద్విలాసంగా జగన్ రెడ్డి చూసుకుంటూ అనందిస్తున్నారు. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా నా టిక్కెట్ అన్నా అంటూ… టెన్షన్ తో ప్రాధేయపడుతూ… తాడేపల్లి ప్యాలెస్ కు రావాల్సి వచ్చింది.
స్పైడర్ సినిమాలో విలన్… ఇతరుల బాధను చూస్తూ ఆనందం పొందే ఓ రకమైన మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. సీఎం జగన్ కు అలాంటి మనస్థత్వం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. తమను అరెస్టులు చేయించిప్పుడు వారు ఈ విమర్శలు చేస్తారు. కానీ.. ఇప్పుడు జగన్ రెడ్డి సొంత పార్టీ నేతలకు టార్చర్ పెడుతున్నారు. ఇది అంత కంటే ఎక్కువ తీవ్రమైన కేసు అని.. వైసీపీ నేతలే ఏడ్చే పరిస్థితి కనిపిస్తోంది.