అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారిపోతారని మరోసారి రుజువు అవుతోంది. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఎప్పుడైనా అకాల వర్షాలు వస్తే.. పొలాల్లోకి దిగిపోయేవారు. ప్యాంట్ ఎగ్గట్టి మోకాలు వరకూ ఉన్న బురదలోకి దిగిపోయేవారు. అక్కడే మైక్ పట్టుకుని మీడియాతో మాట్లాడేవారు. ఆయనకు చేయి పట్టుకోవడానికి సపోర్ట్ కావాలంటే. ఓ సెక్యూరిటీ గార్డుని.. ఒంగోబెట్టి ఆయనపై చేయి పెట్టుకుని మాట్లాడేవారు. అలాంటి షోలో.. ఆయన చేసే ప్రధాన డిమాండ్.. ఎకరానికి ప్రభుత్వం తక్షణం రూ. ముఫ్ఫై వేల సాయం ప్రకటించాలని.
అప్పటికే ప్రభుత్వం రూ. ఐదు వేలో .. పది వేలో సాయం చేసి ఉంటుంది. కానీ జగన్ మాత్రం అది రైతులకు ఎలా సరిపోతుందని చాలా కథలుచెప్పేవారు. తాను సీఎం అయిన మరుక్షణమే అన్ని రకాల సాయం చేస్తానని చెప్పేవారు. రైతులు కూడా ఆయన డెడికేషన్ పట్ల ఎంతో ఆసక్తి చూపేవారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత సీన్ చూసి.. మాత్రం ఇంత మోసమా అనుకుంటున్నారు. ఎందుకంటే అకాల వర్షాలు కాదు కదా.. డ్యామ్ లు కొట్టుకుపోతేనే చూసేందుకు ఆయనకు తీరిక ఉండటం లేదు. ఇక అకాల వర్షాలకు పట్టించుకుంటారని ఎలా అనుకుంటారు. అసలు చూసేందుకే రావడం లేదు.
పోనీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పినట్లుగా పరిహారం అయినా ఇస్తారా అంటే అందులో సగం కాదు కదా..అసలు పరిహారమే ఇవ్వడం లేదు. ఇప్పటి వరకూ ఎకరానికి ఒక్క రూపాయి కూడా పరిహారం ప్రకటించలేదు. నెలకు రూ. పది కోట్ల వరకూ అప్పు చేస్తున్నారు కానీ పంట కోల్పోయిన వారికి పైసా కూడా ఇవ్వడం లేదు. జగన్ తీరు చూసి రైతులు కూడా ఇంత మోసమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. యాక్టింగ్గా గుర్తించక ఓట్లేసినందున సర్వం కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.