ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి టీమ్ ను అభినందిస్తారని ప్రచారం జరిగినా, పోలింగ్ సరళి తేడా కొట్టడంతో జగన్ మనస్సు మార్చుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గురువారం విజయవాడ వెంజ్ సర్కిల్ లోనున్న ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్తుండటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
ఐ ప్యాక్ అందించిన వ్యూహాలు ఈసారి ఫలించలేదని, దాంతో ఈసారి వైసీపీకి ఓటమి తప్పదని వైసీపీలో కలవరం మొదలైంది. ఎన్నికల్లో ఐ ప్యాక్ స్ట్రాటజీలు ఫెయిల్ అయ్యయాని దాంతో వారిపై జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐ ప్యాక్ ఆఫీసుకు జగన్ వెళ్తుండటం వారి సేవలకు వీడ్కోలు పలికేందుకేనా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
వైసీపీ గెలుస్తుందని నమ్మకం కుదిరుంటే జగన్ పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళేవారు, కాని ఆలస్యంగా వెళ్తున్నారంటే ఇది అభినందన కార్యక్రమం కాదు ఖచ్చితంగా వీడ్కోలు పార్టీ ఇచ్చేందుకే వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.