వైసీపీకి ఘోర పరాజయం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయింది. అయితే వైసీపీకి చెందిన వారు మాత్రం ఇంకా జగన్ ను మభ్య పెట్టాలనో మోసం చేయలనో చూస్తున్నారు. వారు కౌంటింగ్ అయిపోయే వరకూ అలా మాట్లాడాలని ఒప్పందం చేసుకున్నారేమో కానీ.. తమ వాదనలో గట్టిపోటీ ఉంటూ.. జగన్ గెలస్తారని ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి మీడియాలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన లోకల్ సర్వేలు, తాడేపల్లి కంపెనీ ఈటీజీ టైమ్స్ నౌలో ఇచ్చిన సర్వే తప్ప ఇంకేమీ ప్రకటించలేదు. చివరికి తమ ఆస్థాన చానళ్లుగా చెప్పుుకునే ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటివి ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రస్తావించలేదు. అదే సమయంలో ఆరా మస్తాన్ తో అతి కష్టం మీద అయినా గెలుస్తారన్నట్లుగా చెప్పించారు. అంతకు మించిన సర్వే లేదన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు.
నాగేశ్వర్ లాంటి ఎనలిస్టులు తమ క్రెడిబులిటిని తాకట్టు పెట్టేసి ఇప్పటికీ అదే చెబుతున్నారు. కౌంటింగ్ వరకూ వైసీపీ క్యాడర్ కు నమ్మకం కలిగించాలనో… జగన్ కు ధైర్యం కలిగించాలనో కానీ వారు చెబుతున్నారు. చివరికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కూడా జగన్ గెలుస్తారని తనకు సమాచారం ఉందన.ి. కేసీఆర్, కేటీఆర్ మాటలు చెప్పుకొచ్చార. ఈ మాటలు జగన ను మోసం చేయడానికే చెబుతున్నట్లుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.