మన రాయితో మనం కొట్టుకున్నట్లే గులకరాయి కేసు రివర్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తోందని వైసీపీ వర్గాలు … వారికి సహకరించిన పోలీసులు అంతర్మథనం చెందుతున్నారు. గులకరాయి కేసు నిందితుడ్ని తాము ఉన్నంత వరకూ బయటకు తీసుకురాకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన అతను… ఎంత కుట్ర జరిగిందో చెప్పాడు.
నిజానికి నిందితుడు సతీష్ దాడి చేసినట్లుగా చిన్న ఆధారం కూడా లేదు. కానీ పోలీసులు చేసిన హ డావుడి హత్యాయత్నం వరకూ వెళ్లింది. కనీసం దాడిచేసిన రాయి కూడా ఇదే అని చెప్పలేకపోయారు. పోలీసులు ఆ రాయికి… టీడీపీ కి లింక్ పెట్టి…పోలింగ్ ముందు విజయవాడ సెంట్రల్ అభ్యర్తి బొండా ఉమను అరెస్టు చేసేందుకు వందల మంది పోలీసుల్ని పంపారు. ఎక్కడా చిన్న ఆధారం లేకపోయినా తప్పుడు స్టేట్ మెంట్లతో ఈ రాజకీయం చేయడానికి పోలీసులు చాలా పెద్ద కుట్ర చేశారని స్పష్టమయింది.
సజ్జల రామకృష్ణారెడ్డి ఈ గులకరాయి డ్రామాకు స్క్రీన్ ప్లే ఇస్తే అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కథ నడిపారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. నాలుగో తేదీ తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి.. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.