14 ఏళ్లు ముఖ్యమంత్రిగా…. పదహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కనీస హక్కులు కూడా లేకుండా అరెస్ట్ చేయడం … వేధింపులకు పాల్పడటం .. అదీ కూడా ఏ మాత్రం ఆధారాలు లేని కేసులు కావడంతో.. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనికి ఖచ్చితంగా బీజేపీ మద్దతు ఉందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చేస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి లండన్ కు వెళ్లి అరెస్టు ప్రక్రియను పర్యవేక్షించారు. ఇప్పుడు ఆయన రావాల్సిన సమయం వచ్చింది. దాంతో ఆయన వస్తారు. అయితే వచ్చిన వెంటనే మోడీ, అమిత్ షాలతో భేటీ ఉంటుందని విస్తృత ప్రచారం చేస్తున్నారు.
పదమూడు, పధ్నాలుగు తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నారని… మోడీ, అమిత్ షాలతో సమావేశం అవుతారని ప్రచారం చేస్తున్నారు నిజానికి అలాంటి అపాయింట్ మెంట్లు ఖరారు కాలేదు. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అపాయింట్ మెంట్లు ఖరారైతే వెళ్లే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు అరెస్ట్ గురించి వివరించేదుకు జగన్ ఢిల్లీ వెళ్తురన్నారని.. వారి అనుమతితోనే ఇదంతా చేస్తున్నట్లుగా ఓ పుకారును ప్రజల్లో ముందుగానే పుట్టించడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
ఈ అంశంపై బీజేపీ ఇప్పటికే ముందుగానే స్పందించింది. అక్రమ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుగానే ఖండించారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే కమిటీలో సభ్యుడు అయిన ఎంపీ కే.లక్ష్మణ్ కూడా చంద్రబాబు అరెస్టును తప్పు పట్టారు. జగన్ రెడ్డి తమ అనుమతితోనే ఇదందా చేస్తున్నట్లుగా ప్రచారం చేయిస్తూండటంతోనే వ్యూహాత్మకంగా లక్ష్మణ్‌తో ప్రకటన చేయించినట్లుగా భావిస్తున్నారు.