జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హఠాత్తుగా బెంగళూర వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు కీలక నేతల్ని కలిశారు. అసలు ఎజెండా మాత్రం కుంకీ ఏనుగులు అని చెప్పారు. అయితే కుంకీ ఏనుగుల కోసమే అయితే పవన్ కల్యాణ్ వెళ్లాల్సిన అవసరం లేదని..ఇంకా ఏదో ఎజెండా ఉందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. అ ఆజెండా ఏమిటో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి అనుమానం ఏమిటంటే… జగన్ బెంగళూరులోనే ఉంటున్నారు.. ఆయనపై ఏమైనా కుట్ర చేశారా అనే.
జగన్కు ఎంత భయమో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బెంగళూరులోనే ఉండి వారానికో రెండు రోజులు వచ్చి పోతున్న వైనమే స్పష్టం చేస్తోంది. నిజానికి ఆయన హైదరాబాద్ పోవచ్చు. గతంలో అక్కడే ఉండేవారు. తాడేపల్లి ప్యాలెస్ ను మించిన ప్యాలెస్ ఉంది. కానీ అక్కడ తాను ఓడించాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి గెలిచి సీఎం అయ్యారు. అందుకే అక్కడికిపోవడానికి ఆయనకు మనసొప్పడం లేదు. బెంగళూరు వేస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్తో సంబంధాల కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో తనకు సెక్యూరిటీ ఉంటుందని ఆయన అనుకున్నారు.
అయితే పవన్ కల్యాణ్ ఇలా బెంగళూరు వెళ్లి సిద్ధరామయ్యతో మాట్లాడటంతో వైసీపీ వర్గాల్లో ఏదో అనుమానం ప్రారంభమయింది. ఒక్క కుంకీ ఏనుగుల గురించే కాదని.. రెండు రాష్ట్రాల్లో ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. అది తమ అధినేతను టార్గెట్ చేసిందేనా అని క్యాడర్.. తనపై ఏదైనా నిఘా పెట్టబోతున్నారా అని జగన్ కూడా టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. మొత్తంగా పవన్ పర్యటన .. వల్ల జగన్ ఇప్పుడు బెంగళూరులోనూ ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది.