సీఎం జగన్ పోలవరం చూడటానికి వెళ్లారు. గత నాలుగేళ్ల కాలంలో రెండు శాతం పనులు జరగకపోయినా డిసెంబర్లో రిబ్బన్ కట్ చేద్దామని ఉబలాటపడ్డారు. కట్ చేస్తే చేసుకోవచ్చు కానీ ప్రాజెక్టు పూర్తి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాలను పక్కన పెడితే అసలు టూర్ ఎజెండా వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద స్టార్ హోటల్ కడతామని… భూములు ఇవ్వాలని మేఘా కృష్ణారెడ్డి ప్రతిపాదించారు. ఆయన ఫైవ్ స్టార్ హోటల్ అంటే కాదు సెవన్ స్టార్ కట్టాలని చెప్పి.. ఆ మేరకు భూములివ్వాలని అధికారులకు జగన్ సూచనలు ఇచ్చారట..
పోలవరం ప్రాజెక్టు వద్ద ఓ కొండ ఉంటుంది. అక్కడ్నుంచి అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ కొండపై మేఘా కన్ను పడిందని దాని మీదే తాము స్టార్ హోటల్ కడతామని.. రాసివ్వాలని అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే.. జగన్ సమీక్షకు వెళ్లి.. ఒక్క మీడియాను అనుమతించకుండా… ఈ టూరిజం .. పర్యాటకాన్ని వెలుగులోకి తెచ్చి స్టార్ హోటల్ పేరుతో మేఘాకు భూములు ఇవ్వడానికి రెడీ అయినట్లుగా చెబుతున్నారు.
పనులు పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీని తరిమేసి రివర్స్ టెండర్ పేరుతో అతి తక్కువకు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసకుున్న మేఘా పనులు చేయడం లేదు. ఏదో ఓ సాకు చెబుతూనే ఉన్నారు. ఆ కంపెనీ వద్ద భారీ యంత్రాలు కూడా లేవు. ప్రాజెక్ట్ సైట్ లో యంత్రాలే కనిపించడం లేదు. అయినా రెండు సార్లు అంచనాలు పెంచారు. నవయుగకు ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువే పెంచారు. అయినా పని కాలేదు. ప్రభుత్వం మారితే.. మేఘా కంపెనీపై చర్యలు తీసుకోవడం ఖాయం. చెప్పినట్లుగా పని చేయనందున భారీ ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా స్టార్ హోటళ్లకు భూములిచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇంజనీరింగ్ రంగంలో ఉన్న మేఘా .. స్టార్ హోటల్ పెట్టాలనుకోవడమే విచిత్రం.. ఆ పేరుతో భూములు తీసుకోవాలనుకోవడం.. మరింత విచిత్రం. ఈ విచిత్రాలు ఏపీలో ఇంకెంత కాలం చూడాలో.