చంద్రబాబు ఇల్లు మనగలేదని వైసీపీ అధినేత జగన్ కుళ్లిపోతున్నారని ఎవరికైనా అర్థం అవుతుంది. ఆయన చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం అని చెబుతూ వస్తున్నారు. తన హయాంలో ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు 120 ఏళ్లలో రానంత వరద వచ్చినా.. చంద్రబాబు ఇంటి సమీపానికి కూడా నీళ్లు రాలేదు. దీంతో జగన్ ఏడుపు పతాక స్థాయికి చేరుకుంది.
చంద్రబాబు ఇల్లు ఎందుకు మునగలేదంటే బుడమేరు వాగులో నీళ్లు మళ్లించారని.. గేట్లేశారని సొల్లు చెబుతున్నారు. బుడమేరు గురించి ఆయన చెప్పిన కథ విని… ఈ పిచ్చికి మందు లేదని అనుకునేవారు ఎక్కువయ్యారు. చివరికి వైసీపీ నేతలు కూడా తమ పరువు పోయిందని అనుకోవడం తప్ప ఏమీ చేయలేరు. చంద్రబాబు ఇల్లు మునగకపోవడానికి ఆయన కారణం చెప్పాలనుకున్నారు చెప్పారు. అది ఫేకా.. రియలా అన్నది ఆయనకు అనవసరం.
ఓ మనిషిలో ఇంత దారుణమైన కుళ్లు, కుతంత్రాలు ఉండటం.. అందరూ తనను చూసి నవ్వుతారని తెలిసినా.. కాన్ఫిడెంట్ గా అవే మాటలు చెప్పడం జగన్ లాంటి వారికే సాధ్యం. వీరు అసాధారణమైన మానసిక వికృతంతో బాధపడుతూంటారు. వీరికి ఎంత దూరంగా ఉంటే.. ఆ చుట్టుపక్కల ఉండేవారికి అంత మంచిదని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.