ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జంట్ గా ఢిల్లీ వెళ్లి కొన్ని పనులు చక్క బెట్టాలనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నుంచి పిలుపు రావడం లేదు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందులో మొదటిది ప్రత్యక్షంగా కనిపిస్తున్న సమస్య జీతాలకు నిధులు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఓడీలోనే ఉంది. దాన్నుంచి బయటపడి… జీతాలకు నిధులు సమీకరించుకోవాలి. మరో వైపు అప్పు పరిమితి ముగిసిపోయింది. ఆర్థిక సమస్యలు తీరాలంటే తప్పనిసరిగా కేంద్రం సహకారం అవసరం. ఇంకా రెండు నెలలు గడవాల్సి ఉంది. పలు రుణాల తిరుగు చెల్లింపులు పెండింగ్ ఉండిపోయాయి.
వీటన్నిటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు ఉన్నతాధికారులు వెళ్లి .. పరిస్థితిని చక్కదిద్దేవారు. కానీ ఈ మధ్య జగనే స్వయంగా ఢిల్లీ వెళ్లి నేరుగా ప్రధానిని కలుస్తున్నారు. ఆ తర్వాత కొంత ఊరట లభిస్తోది. ఈ కోణంలోనూ ఆయన ఢిల్లీ ప్రయత్నాలు చేస్తున్నారు.ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల కోసం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఫలితం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజుల పర్యటనలు రద్దయ్యాయి. ఆదివారం కూడా ఆయన ఢిల్లీకి వెళ్తారనే అనుకుంటున్నారు. కానీ వెళ్తారో లేదో స్పష్టత లేదు. ఆదివారం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరికీ అపాయింట్ మెంట్లు ఇవ్వరు. అయితే ఆదివారం వెళ్తే సోమవారం అపాయింట్మెంట్లు దొరకవచ్చన్న ఆశతో ఉన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లి పర్యటన చేపట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ముందస్తుకు సీఎం జగన్ ప్రధాని నుండి స్పష్టమైన హామీ కోసం గతంలో వెళ్లిన పర్యటనకు కొనసాగింపు గానే ఈసారి వెళ్లబోతున్నారని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లి పర్యటన ఇప్పుడెందుకనేదానిపై పూర్తిస్థాయి లో స్పష్టత లేదు. కానీ, పలు కీలక అంశా లపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తోం ది. మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారైతే ఎప్పుడైనా బయలుదేరవచ్చని చెబుతున్నారు.