పదహారు సీట్లతో చక్రం ఎలా తిప్పుతారని.. చుట్టుముడుతున్న విమర్శలకు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ … వాటికి అదనంగా ఇప్పటికే నూట యాభై సీట్లు పోగేశామని చెబుతున్నారు. తాము చక్రం తిప్పడం ఖాయమని చెబుతున్నారు. అందులో ఇరవై ఐదు సీట్లు జగన్ ఖాతాలోనివట. ఈ విషయాన్ని కేటీఆర్.. స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటున్నారు. మహబూబ బాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్.. ఏపీలో జగన్ గెలుస్తారని.. అక్కడ గెలిచిన సీట్లతో.. వచ్చి కేసీఆర్ నాయకత్వంలో… ఫెడరల్ ఫ్రంట్ లో కలుస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరూ కలిసినా 150 లెక్క కలవదు కాబట్టి.. గతంలో కేసీఆర్… ప్రత్యేక విమానాలేసుకుని వెళ్లి కలసి వచ్చిన మమతా బెర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్ లాంటి వారిని ఫెడరల్ ఫ్రంట్ ఖాతాలో వేసేసుకున్నారు.
వారంతా జగన్ వచ్చినట్లుగా.. కేసీఆర్ వెంట నడుస్తారన్నట్లుగా… తన ఖాతాలో వేసేసుకుంటున్నారు. పదహారు సీట్లతో చక్రం ఎలా తిప్పుతారని.. సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతూండటంతో.. కొత్తగా… ఇతర రాష్ట్రాల పార్టీల ఎంపీలు కూడా తమ ఖాతానే అన్నట్లుగా… చెప్పి.. తాము ఓ శక్తిగా ఉన్నామని… చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం… టీఆర్ఎస్కు పదహారు మంది ఎంపీలున్నారు. వారు చెప్పినట్లుగా.. ఇంత వరకూ ఒక్క రూపాయికూడా.. కేంద్రం నుంచి నిధులు తేలకపోయారు. మోడీ ఒక్క రూపాయికూడా నిధులివ్వలేదని.. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతూంటారు.
జగన్మోహన్ రెడ్డి అసహాయతను అడ్డం పెట్టుకుని.. ఖండించలేని స్థితిలో జగన్ ఉండటంతో… ఏపీ ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్ పెరిగినప్పటికీ… తమ సీట్లు తమకు ముఖ్యం అన్నట్లుగా.. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఏపీలో జగన్కు నష్టం జరిగిన పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తెలంగాణలో.. ఆ పార్టీకి చెందిన సానుభూతి పరుల ఓట్లు తమకు వస్తే చాలున్నట్లుగా ప్రకటిస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.