జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి రాజకీయ నేతలందరకీ ఒకటే చెప్పారు. అదే రెడ్ బుక్. రెడ్ బుక్ పాలన సాగుతోందని రెడ్ బుక్ లో పేర్లు రాసుకుని అందరిపై దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణ. చిన్న చిన్న గొడల కారణంగా జరిగిన ఘటనలపై సాక్షి ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను జగన్ జంతర్ మంతర్లో ప్రదర్శించారు. కానీ రెడ్ బుక్ గురించి చెప్పడం మాత్రం మర్చిపోలేదు.
రెడ్ బుక్ లో పేర్లు ఎందుకు ఎక్కాయో జగన్ చెప్పారా ?
జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించి భారీగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఉన్న పేర్లు ఎందుకు రాసుకున్నారో కూడా చెబుతారా ?. అధికారం ఉందని అహంకారంతో ఎవరినైనా ఏమైనా చేయవచ్చన్న ఉద్దేశంతో చెలరేగిపోయిన వ్యక్తుల పేర్లే అందులో ఉన్నాయి. కుటుంబాన్ని టార్గెట్ చేసి.. తప్పుడు కేసులు పెడితే ఎవరైనా ఊరుకుంటారా ?. పార్టీ కార్యకర్తల్ని శారీరకంగా హింసించి.. ఆస్తుల ధ్వంసం చే సిన వారి పేర్లే అందులో ఉన్నాయి. చట్టాలు, రాజ్యాంగాన్ని అగౌరవపర్చి… జగన్ రెడ్డి సేవలో తరించిన వారి పేర్లే అందులో ఉన్నాయని లోకేష్ పలుమార్లు చెప్పారు.
చట్టప్రకారం శిక్షించాల్సిన వారి జాబితానే రెడ్ బుక్
లోకేష్ ఎప్పుడూ ఎబౌవ్ ది లా తాము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేరు. సాయంత్రం ఏడు దాటితో ఇంటలిజెన్స్ చీఫ్ తో పాటు సజ్జల ఇతర కుట్ర దారుల్ని పెట్టుకుని చంద్రబాబును, టీడీపీ నేతల్ని కేసుల్లో ఇరికించడానికి ఏ తప్పుడు కేసులు పెడదామా అని చూడటం లేదు. దొరికిన సాక్ష్యాల ఆధారంగానే ముందుకు వెళ్తున్నారు. చట్ట ప్రకారమే వెళ్తామని.. దాడుల సంస్కృతి తమది కాదని.. ముఖ్యంగా కింది స్థాయి వారి జోలికి అసలు వెళ్లేది లేదని చెబుతుననారు. రెడ్ బుక్ భయంతో కోర్టుకు వెళ్లారు. కోర్టుకు కూడా అదే చెప్పారు.
Read Also : రెడ్ బుక్.. అసలు అంబటి బాధేంటి?
రెడ్ బుక్ తనదాకా వస్తుందన్నదే జగన్ భయం
రెడ్ బుక్ లో తన పేరు కూడా ఉంటుందని..తన దాకా వస్తుందని జగన్ భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకే ఆయన రెడ్ బుక్ ను కలవరిస్తున్నారు. దేశమంతా ప్రచారం చేస్తున్నారు. ఆయన చేసినా చేయకపోయినా రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ చట్ట పరంగానే జరుగుతుందని లోకష్ చెబుతూ వస్తున్నారు. అందులో జగన్ పేరు లేకుండా ఉండదు. ఆయనతో చట్టపరమైన చర్యలతోనే రెడ్ బుక్కు ముగింపు ఉండొచ్చు. ఏడ్చినా.. కిందా మీదా పడినా జరగాల్సినవి జరుగుతుంది. ఎందుకంటే ఏదీ చట్ట విరుద్ధంగా జరగదని లోకేష్ చెబుతున్నారు మరి.