ఏపీలో జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం తీవ్ర విమర్శల పాలౌతుంది. వినుకొండలో జరిగిన హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలనడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై దేశమంతా ఏపీ వైపు చూసేలా ఆందోళనలకు దిగుతామని జగన్ హెచ్చరించడం గతాన్ని తవ్వి తీసుకున్నట్లు అయింది.
వినుకొండలో జరిగిన ఘటన ఖండనార్హమైనదే. కానీ , ఈ ఒక్క ఘటనను చూపుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమే ఎబ్బెట్టుగా ఉంది. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన ఘటనల సంగతేంటి..? అని టీడీపీ ప్రశ్నిస్తోంది. డాక్టర్ సుధాకర్ ను మనసికంగా వేధించి చంపారని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని, మొత్తంగా వైసీపీ హయాంలో 1588హత్యలు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తూ జగన్ పై టీడీపీ ఎదురుదాడి చేస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే శాంతి భద్రతల వైఫల్యం అంటూ జగన్ మొసలికన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు గాడి తప్పడంలో జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు.
జగన్ సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు ఆటంకం కల్పించిన విషయం టీడీపీ గుర్తు చేస్తోంది. బాబాయ్ హత్య విచారణ సవ్యంగా సాగేలా చూడాలని అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కేంద్రాన్ని కోరని జగన్.. ఇప్పుడు ఓ ఘటనను చూపుతూ రాష్ట్రపతి పాలన అంటూ రెచ్చిపోతుండటం రాజకీయం కోసం కాదా ..? జగన్ ను గట్టిగా వాయించేస్తున్నారు.