ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కరోనా బారిన పడిన వారియర్స్‌గా ఉన్న వారికి.. వారియర్స్‌గా.. ఇతురలకు ప్లాస్మా దానం చేసే వారికి… దురదృష్టవశాత్తూ.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూడా అండగా ఉంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి… డిశ్చార్జ్ చేసేటప్పుడు తలా రూ. రెండు వేలు ఇవ్వాలని జగన్ గతంలో ఉత్తర్వులిచ్చారు. అప్పట్లో.. అలా రూ. రెండు వేలు ఇస్తున్నట్లుగా.. ఫోటోలు కూడా.. విడుదల చేశారు. ఆ తర్వాత… కరోనా మరణాలు పెరుగుతూండటంతో.. చాలా కుటుంబాలు వేదన పడుతున్నాయి. దాంతో.. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కోసం.. రూ. 15వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాజాగా.. కరోనా నుంచి కోలుకుని… ప్లాస్మా దానం చేసే వారికి రూ. ఐదు వేలు ఇవ్వాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనాపై పోరులో గెలిచిన వారిని.. ఓడిన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు విశాల హృదయంతో ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. ఆ మొత్తం చిన్నదైనా.. వారికి ఎంతో కొంత సాయంగా ఉంటుంది. అందుకే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ.. అమలు తీరులో అధికారులు వ్యవహరిస్తున్న తీరే … వివాదాస్పదమవుతోంది. కరోనా కేసులు మొదట్లో.. తక్కువగా ఉన్న సమయంలో రూ. రెండు వేలు డిశ్చార్జ్ అయ్యే పేషంట్లకు ఇచ్చేవారు. ఇప్పుడు… ఎవరికీ ఇవ్వడం లేదు. కనీసం.. తర్వాత ఇస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకోవడం లేదు. అడిగిన వారికి సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు. ముఖ్యమంత్రే ఆదేశించిన తర్వాత నిధుల కొరత ఉండే అవకాశం లేదు.
రోజుకు.. అరవై , 70 మంది చనిపోతున్నారు. వారి కుటుంబాలకు రూ. 15వేల సాయం చేస్తున్నారో లేదో అధికారులు ప్రకటించడం లేదు. తమకు సాయం అందిందని.. మృతుల కుటుంబాలు కూడా.. చెప్పడం లేదు. ఒక వేళ ఇచ్చి ఉంటే… మాత్రం.. ప్రభుత్వం.. అధికారులు ఘనంగా ప్రచారం చేసుకునేవారు. అలాంటి ప్రచారమూ కనిపించడం లేదు. తాజాగా ప్లాస్మా దాతలకు జగన్ రూ. ఐదు వేలు ఇవ్వాలని నిర్ణయించారు. నిజానికి ఏపీలో ప్లాస్మా ధెరపి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుందో… స్పష్టత లేదు. కొద్ది రోజు క్రితం.. కర్నూలు ఆస్పత్రిలో చేసినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రత్యేకంగా ప్లాస్మా సేకరణకు.. వైద్య వర్గాలు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దాతలు.. ప్లాస్మాను ఎక్కడ దానం చేయాలో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి మౌలికమైన సమస్యలను పరిష్కరించి అందరికీ నగదు సాయం అందేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే.. మనిషికి మూడు మాస్క్‌లు అని ప్రకటించినట్లుగా… అన్నీ అనీ జనం ఫీలయ్యే ప్రమాదం ఉంది.