ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాలు, ముందస్తు ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలతో భేటీకి సీఎం జగన్ రెడీ అయ్యారు. ఏప్రిల్ మూడో తేదీన ఆయన ఎమ్మెల్యేలు,జిల్లాల ఇంచార్జులతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో గడప గడపకూ కార్యక్రమంపైనా సమీక్ష చేయనున్నారు. మామూలుగా గడప గపకూ కార్యక్రమాన్ని ఈ పాటికి పూర్తి చేసి ఉండాల్సింది. కానీ పెద్దగా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ఎమ్మెల్సీ ఎన్నికలు ఇతర కారణాల వల్ల ఆలస్యం అయింది.
ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో నలభై మంది వరకు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కారణం… ఈ ఆయన గతంలోలా కఠినంగా ఉంటారా లేకపోతే అందరికీ భరోసా ఇస్తారన్నది తేలాల్సి ఉంది. ఐ ప్యాక్ రిపోర్టుల విషయంలోనూ కొంత చూసీ చూడనట్లుగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఐ ప్యాక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమీ చేయలేకపోవడంతో జగన్కు వారిపై కాస్త నమ్మకం సడలినట్లుగా చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అన్నదానిపై ఆ భేటీలో జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మామూలుగానే ఆయన ముందస్తు ఎన్నికల కోసం అన్నట్లుగా గడప గడపకూ కార్యక్రమాన్ని ఏడాది కిందటే పూర్తి చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది. గవర్నర్తో భేటీలు… ఢిల్లీ పర్యటనల తర్వాత ఇలా ఎమ్మెల్యేలతో భేటీ ఏర్పాటు చేయడం… వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠకు కారణం అవుతోంది.