జనసేనతో పొత్తు విషయంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ అనేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన ఓ రకంగా బహిరంగ ఆహ్వానం పంపారని అనుకోవాలి. చంద్రబాబునాయుడు ఎప్పుడూ జనసేనను వ్యతిరేకంగా ప్రకటించలేదు. గత ఎన్నికలకు ముందు .. అభ్యర్థుల్ని ప్రకటించే చివరి నిమిషంలోనూ పవ్ కల్యాణ్‌కు కలసి నడుద్దాం రమ్మని ఆఫర్ ఇచ్చారు. కానీ పవన్ మాత్రం తన దారిలో తాను నడిచారు.
విన్-వన్ కాదు లూజ్ -లూజ్ నిర్ణయాలు !
తాను గెలవకపోయినా ఓడిస్తానని సవాల్ చేసి .. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు పవన్ కల్యాణ్ . ఆయన గెలవలేదు కానీ ఆయన సవాల్ చేసినట్లుగా టీడీపీ ఓడిపోయింది. అంతకంటే ఘోరంగా జనసేన కూడా ఓడిపోయింది. జనసేనకు ఆరు శాతమే ఓట్లు వచ్చాయి. చివరికి పవన్ కల్యాణ్ కూడా ఓడిపోయి.. వైసీపీ నేతలతో దారుణమైన విమర్శలు పడాల్సి వస్తోంది. అంటే్.. పవన్ నిర్ణయం వల్ల జనసేన ఇమేజ్ మసకబారింది. ఆయన రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయారన్న చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడైనా పొత్తులు పెట్టుకుంటే విన్ – విన్ ఫార్ములా ఉండాలి. కానీ ఇక్కడ పెట్టుకోకపోవడం వల్ల లూజ్ ..లూజ్ సిట్యూయేషన్ వచ్చింది. ఇది టీడీపీ, జనసేనకాదు..ఇప్పుడు ఏపీకే నష్టం చేస్తోంది.
జగన్‌కు ఎప్పుడూ గౌరవం తగ్గనీయని చంద్రబాబు!
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడుచంద్రబాబు పవన్‌కు ఎప్పుడూ గౌరవం తగ్గలేదు.ఆయన అడిగిన సమస్యలన్నింటినీ పరిష్కరించారు. కానీ రామ్‌మాధవ్ వంటి వారి మాయలో పడి నాలుగేళ్ల తర్వాత ఆయన స్టాండ్ మార్చుకున్నారు. శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అంటూ వైసీపీ నేతలు చేసిన పిచ్చి ఆరోపణల్ని తాను మోశారు. శ్రీరెడ్డితో తిట్టించింది టీడీపీనే అంటూ షోచేశారు. టీడీపీ అలాంటివి చేయదని ఆయన అంచనా వేయలేకపోయారు. కానీ.. చివరికి తెంపేసుకున్నారు. పవన్ ఎంత రాంగ్ ట్రాక్‌లోకి వెల్లినా… కొంత మంది టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేసినా వారందర్నీ చంద్రబాబు నిలువరించారు. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారు.
బీజేపీ…ఇతర పార్టీలతో కలిస్తే జనసేనకు మిగిలేదమీ ఉండదు !
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన నేతలు స్థానికంగా కలసిపోయి పోటీ చేశారు. టీడీపీ – జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తుతో జనసేనకు ఒక్క ఓటు ఎక్కువ రాలేదు. బీజేపీతో పొత్తు పరిస్థితీ అదే. పైగా పవన్ ఫ్యాన్ బేస్‌లో కీలకమైన ముస్లిం వర్గాలు దూరమయ్యాయి. బీజేపీతో వద్ద బాబోయ్ అని క్యాడర్ ఇప్పటికే గొంతెత్తుతోంది. పరిస్థితిని గమనించి పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిలకడ లేదని అంటారేమోనని ఎదురు చూస్తున్నారు.
గెలవాలంటే కలవక తప్పదు !
గత ఎన్నికల్లో టీడీపీకి కాస్త తక్కువగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అధికార వైఎస్ఆర్సీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓ వేవ్ కనిపించింది. అలాంటి వేవ్‌లోనూ వచ్చిన ఫలితాలు అవి. అదే టీడీపీ, జనసేన కలిసి ఉంటే చాలా చోట్ల ఫలితాలు తారుమారయ్యేవి.కానీ ఓవరాల్‌గా ఫలితం మారేది కాదు. అప్పుడు పరిస్థితులు వేరు . టీడీపీకి అధికార వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కలిసి పోటీ చేస్తే వైసీపీపై అధికార వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అవకాశం ఉందన్న అంచనా ఉంది. టీడీపీతో జత కడితేనే జనసేనకు కాస్త బలం వస్తుందని .. ఈ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వస్తుందని లేకపోతే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనా జనసేనలో ఉంది. కులాల రాజకీయాల్లో కొట్టు మిట్టాడుతున్న ఏపీలో పవన్ సపోర్ట్ ఉంటేనే అధికారంలోకి రాగలమని టీడీపీ కూడా భావిస్తోంది. అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న సమయంలో పవన్ కలిస్తే టెన్షన్ ఉండదని భావిస్తున్నారు. ఈ పరిస్థితి అంచనా వేసుకుంటేనే ఎవరికైనా భవిష్యత్ ఉంటుంది. తమ బలంతో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. అలా జరగకూడదని…అనుకుంటే.. తమ బలం కూడా తరిగిపోతుందన్న విషయాన్ని జనసేన గుర్తుంచుకుని అడుగు ముందుకేస్తే .. ఉభయతారకంగా ఉంటుంది.