జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చాలా ఆదర్శలు చెబుతూ ఉంటారు. అవినీతి గురించి చెబుతారు… అవినీతి పరుల్ని పార్టీలో చేర్చుకుంటారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతూంటారు. కానీ జనసేన నేతలు.. మహిళల్ని.. కెమెరా ముందు ఏ ఒక్క నేత అవమానించనంత దారుణంగా అవమానిస్తూ ఉంటారు.
ఓ జనసేన నేత నేరుగా… టీవీ చర్చలో… ఓ టీడీపీ మహిళా నేతను బండబూతులు తిడతారు..! మరో జనసేన నేత… ఎదురుగా ఉన్నది మహిళా నేత కాదు కాబట్టి… ఆ నేత చెల్లిల్ని అసభ్యకరంగా దూషిస్తారు..! .. టీవీ చానల్ చర్చల్లో.. జనసేన నేతల తీరు ఇది.
ఓ సారి సుకంర దిలీప్ కల్యాణ్ అనే జనసేన నేత.. టీడీపీ నేత యామిని శర్మపై.. చాలా తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. ఇప్పుడు.. ఆ బాధ్యత… జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ తీసుకున్నారు. విజయవాడకు చెందిన టీడీపీ నేత పట్టాభితో కలిసి చర్చల్లో పాల్గొన్న శ్రీధర్.. సంవాదంలో.. ఆయన సోదరిపై బండబూతులు ప్రయోగించారు.
మోదీ పర్యటనపై.. ఏపీ 24/7 అనే చానల్లో చర్చ జరిగింది. ఈ చర్చల్లో టీడీపీ నేత పట్టాభిపై విరుచుకుపడిన అద్దేపల్లి శ్రీధర్ ఆయన సోదరిని కూడా.. తిట్టారు. దీనిపై మనస్థాపానికి గురైన పట్టాభి… మహిళలను కించ పరిచేలా దూషించిన జనసేన నాయకులు అద్దే పల్లి శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్చ వీడియోలు సాక్ష్యంగా అందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ నాయకులకు నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ టీడీపీ నేతలు పట్టాభి, తాడి శకుంతల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ చర్చలో పాల్గొంటే రాజకీయ అంశాలు మాట్లాడకుండా కుటుబంపై నిందలు వేస్తారా? అని.. పట్టాభి.. వేదనకు గురయ్యారు. మహిళలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా పవన్ బహిరంగ క్షమాపణ చెప్పి అద్దేపల్లి శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే 24 గంటల తర్వాత జనసేన కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు పట్టాభి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మహిళలంటే.. అమితమైన అభిమానం. ఆయన వారిని గౌరవిస్తారు. కానీ ఆయన పార్టీ నేతలు మాత్రం… ఈ విషయంలో ఒక్క శాతం.. కూడా.. గౌరవాన్ని ఇవ్వరు. ఎన్ని ఘటనలు జరిగినప్పటికీ.. ఇలాంటి విషయాల్లో పవన్ కల్యాణ్ సైలెంట్‌గా ఉంటూండటంతో… మిగిలిన వారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. టీడీపీ నేత సాదినేని యామిని శర్మపై.. సుంకర దిలీప్ కల్యాణ్ అనే జనసేన నాయకుడు.. అత్యంత అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఆయనను ఎవరూ..ఒక్క మాట కూడా అనలేదు. ఇదే అలుసుగా తీసుకుని ఇతర నేతలు .. మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది జనసేన ఇమేజ్ ను మహిళల్లో దిగజారుస్తోంది.