తిరుపతి జనసేన నేత కిరణఅ రాయల్ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై దాఖలు చేసిన ఓ పిటిషన్ సంచలనంగా మారుతోంది. కొన్నాళ్ల కిందట.. రోజా ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ రాయల్ ను ఇంట్లో అరెస్టు చేశారు. ఆయన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆయన ఫోన్ నుంచి సమాచారం మొత్తం చోరీ చేశారు. ఆ సమాచారంతో వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇదంతా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కనుసల్లో జరుగుతోందని కిరణ్ రాయల్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ముగ్గురికీ నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అంతేకాకుండా.. కాల్ రికార్డ్స్ ను కూడా కోర్టుకు అందించాడు. ఈ క్రమంలో.. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఒక్క కిరణ్ రాయల్ కాదు.. తప్పుడు కేసులతో విపక్ష నేతలను అరెస్టు చేయడం.. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడం.. డేటా చోరీ చేయడం.. వాటితో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం అనేది.. వైసీపీ పోలీసులకు ఓ పెద్ద పనిగా మారింది. చివరికి రఘురామ ఫోన్ నుంచి కూడా ఇలాగే చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇచ్చే రూలింగ్ కీలకం కానుంది. అనేక మంది ఇదే ఆరోపణలపై కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.