చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏం చేయాలనుకున్నారో చేశారు.. తర్వాత అంతే సైలెంట్ గా అమరావతి వెళ్లిపోయారు. ఆయన వచ్చి వెళ్లిన విషయం తెలస్తుందేమోనని తర్వాత మీడియా వాట్సాప్ గ్రూప్ లో .. సీఎస్ గారు వచ్చి బోగాపురం ఎయిర్ పోర్టు పనుల్ని పరిశీలించి వెళ్లారని చెప్పారు.
ఇప్పటికిప్పుడు నత్త నడకన సాగుతున్న బోగాపురం ఎయిర్ పోర్టు పనుల్ని సీఎస్ ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరమేమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. అదీ కూడా రహస్యంగా. చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేదు. అకాల వర్షాల పంట నష్టం గురించి పట్టించుకోలేదు. కానీ ఇలాంటిపనులు మాత్రం చేస్తున్నారు. ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో బోగాపురంలో ఏదో ఘనకార్యాన్ని చక్క బెట్టుకుని వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
సీఎస్ వ్యవహారశైలి చాలా అనుమానాస్పదంగా ఉంది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా లెక్క చేయడం లేదు. ఆయనను ఎవరూ కదిలించలేకపోతున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా కుర్చీలో ఫెవికాల్ వేసుకుని కూర్చుని తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. సీఎం జగన్ విదేశాలకు వెళ్లినా.. ప్రభుత్వం రాకపోతే.. ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారని దానికి తగ్గట్లే .. సీఎస్ పనులు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.