ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో దానిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్… తమకు పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని ఓ రేంజ్ లో ఆయన వాయిస్ ను వాడుకుంది.
ఇప్పుడు ఆయనే హైదరాబాద్ ను మరో పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చేసిన డిమాండ్ పట్ల బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుందనేది అందరి సందేహం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని తెలంగాణ పట్టభద్రులకు పిలుపునివ్వడంతో అందుకు కృతజ్ఞతగా, ఏపీపై సానుభూతి వ్యక్తం చేస్తూ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ డిమాండ్ పై సానుకూలంగా స్పందిస్తే అది బీఆర్ఎస్ కు మరింత ఇబ్బంది తెచ్చిపెడుతుందనేది ఓపెన్ సీక్రెట్. వీటిని పట్టించుకోకుండా ఆ డిమాండ్ పై ఎదురుదాడికి దిగితే బీఆర్ఎస్ సానుభూతిపరుల మద్దతు భవిష్యత్ లో కోల్పోవాల్సి వస్తుందా అనే కోణంలో ఆ పార్టీ ఆలోచిస్తూ ఉండొచ్చు. మధ్యేమార్గంగా సైలెంట్ గా ఉంటే అదీ విమర్శలకు దారితీస్తోంది.
దీంతో లక్ష్మీనారాయణ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను బుక్ చేసేలా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.