హీరోయిన్ జెత్వానీ కేసులో కుట్ర మొత్తం బట్టబయలు అయిపోయింది. ఏపీ పోలీసుల మాఫియా ఆధారాలతో సహా ఏపీ పోలీసులకే దొరికిపోయింది. జెత్వానీ అనే నటికి విద్యాసాగర్ ఎప్పుడో పరిచయమే కానీ.. ఆ భూమి అమ్మకాలు, డాక్యుమెంట్లతో సంబంధమే లేదు.. పోలీసులే తయారు చేశారు. ఆ విషయాలపై … జెత్వానీ అమ్మకానికి పెట్టారంటున్న భూమికి అడ్వాన్స్ ఇచ్చారని పోలీసులు నమోదు చేసిన వ్యక్తి.. స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. జెత్వానీ ఎవరో తెలియదని.. ఆమెకు తాము డబ్బులివ్వలేదని..భూమి అమ్మకానికి ఆమె పెట్టలేదని ప్రకటించారు. ఆ డాక్యుమెంట్లు రెడీ చేసిన రైటర్ కూడా.. తనను బెదిరించి పోలీసులు ఈ డాక్యుమెంట్లు తయారు చేయించారని చెప్పేశారు.
ఇక స్వయంగా విశాల్ గున్ని..కేసు నమోదవడానికి ముందే బృందంతో ముంబైకి వెళ్లారు. జత్వానీ ఇంటిదగ్గర రెక్కీ చేశారు. రెండో తారీఖు కేసు నమోదు కాగానే.. ఆమెను.. ఆమె కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకొచ్చారు. అందు కోసం వారికి స్టార్ హోటల్స్ లో బస…. లగ్జరీ కార్లను ఏర్పాటు చేశారు. ఏవరు ఏర్పాటు చేశారో కూడా వివరాలను బ యటకు తీశారు.
మొత్తం కుటుంబాన్ని అరె్స్ట్ చేసి తీసుకు రావడం ..నలభై రోజుల పాటు నిర్బంధించడం.. కోర్టులో రిమాండ్ విధించిన విషయం కూడా బయటకు తెలియకుండా జాగ్రత్తపడటంతో మొత్తం గూడుపుఠాణిపై క్లారిటీ వచ్చేసింది.
పోలీసులు చేసింది పరిపూర్ణ స్థాయిలో అధికార దుర్వినియోగం. ఇలాంటి నేరాల్లో పట్టుబడితే వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు ఉంటాయి. వారు చేసిన నేరాలు చాలా తీవ్రమైనవని.. ఇదే మొదటి సారి కాదని.. వారి రికార్డు అంతా పంపి.. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా పదహారు మందిలో అందరూ.. కఠినమైన శిక్షల్నే ఎదుర్కోబోతున్నట్లుగా చెబుతున్నారు.