సాక్షి పత్రికపై హీరోయిన్ కాదంబరి జెత్వానీ యాభై కోట్లకు పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ..తనపై తప్పుడు ఆరోపుణలు చేశారని.. పన్నెండు క్రిమినల్ కేసులున్న కుక్కల విద్యాసాగర్ కు మద్దతిస్తూ.. తనపైన నిందలు వేశారని.. అన్నీ అబద్దాలేనని ఆమె ఈ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం జరిగింది యాభై కోట్లు కట్టాలని నోటీసులో పేర్కొన్నారు.
అధికారం ఉంది కదా అని చేసింది తప్పుడు పనులు ఇప్పుడు అవి బయటకు వస్తే బాధితులపైనా తప్పుడు ప్రచారం చేయడం.. వారి క్యారెక్టర్లను కించపర్చడం .. ఎదురుదాడి చేయడం నైజం. అక్రమ సంపాదనతో పెట్టిన మీడియా చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నాురు. హీరోయిన్ జత్వానీ విషయంలో సాక్షి మీడియా చేసిన ప్రచారం పరమ రోతగా ఉంటుంది. ఆమెను బ్లాక్ మెయిలర్ గా .. వ్యభిచారణిగా… దేశవ్యాప్తంగా కేసులు ఉన్న మహిళగా చూపించారు. కానీ ఒక్కటి కూడా అది నిజమని నిరూపించే సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టలేకపోయారు.
ఎవరిని రక్షించడానికి ఆమెపై తప్పుడు కేసులు పెట్టారో కానీ.. అసలు ఆమె క్యారెక్టర్ తప్పుడుదని చెప్పడానికి నీచమైన జర్నలిజానికి పాల్పడ్డారు. అయితే చాలా మందిలాగా ఆమె కామ్ గా వదిలేయడానికి సిద్ధంగా లేరు. న్యాయపోరాటం ప్రారంభిచారు. ఇప్పుడీ పరువు నష్టం కేసులో భారతి రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఓ మహిళపై ఇలాంటి నిందల్ని.., ఓ బాధ్యతాయుతమైన మీడియా వేయడాన్ని ఏ న్యాయస్థానాలు అంగీకరించారు. ఇప్పటికే లోకేష్ వేసిన ఓ పరువు నష్టం కేసులో విశాఖ కోర్టులో విచారణ జరుగుతోంది.