కేసీఆర్ సర్కార్ గొప్పగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు… ఎన్నికలకు ముందు అతి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. విద్రోహ చర్య అంటూ కేసులు పెట్టినా… నిర్మాణ, డిజైన్ లోపమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఒక్క పిల్లర్ కాదని… ఐదారు కుంగిపోయాయనని గుర్తించారు. ఇప్పుడీ బ్యారేజీని ఖాళీ చేశారు. మరమ్మతులు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు.
ఈలోపే కాళేశ్వరంలో కీలక బ్యారేజీ అయిన అన్నారంలో పరిస్థితి బ్యారేజీ కిందకు నీళ్లు వెళ్లిపోతున్నాయి. రెండు పెద్ద బుంగలు పడ్డాయి. అక్కడ ఇసుక బస్తాలు వేసి… వాటిని ఆపుదామని ప్రయత్నిస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రాఫ్ట్ ఫౌండేషన్ క్రింద నుంచి నీళ్లు పోవటం చాల పెద్ద ఇష్యూ అని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి బయట పడటం.. వాటిని సమర్థించుకోవడం బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన బీఆర్ఎస్ ..ఇప్పుడు ప్రాజెక్టు గురించి కనీసం నోరెత్తలేకపోతోంది. లక్ష కోట్లకుపైగా వ్యయంతో కట్టిన ప్రాజెక్టు కావడంతో … ప్రజలకు సెంటిమెంట్ ఉంటుంది. అప్పులు చేసిన ప్రాజెక్టు ఏ మాత్రం ఉపయోగం ఉండకపోగా… అది కూడా తప్పులతడకగా నిర్మించారని … భారీ అవినీతిగా ప్రజలు భావిస్తే… బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టంజరుగుతుందో అంచనా వేయడం కష్టం.