శంకర్ ఆశలన్నీ ‘భారతీయుడు 2’పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం శంకర్‌కు చాలా కీలకం. ఎందుకంటే ‘భారతీయుడు 2’ తరవాతే గేమ్ ఛేంజర్ వస్తుంది. గేమ్ ఛేంజర్ బజ్ పెరగడం, తగ్గడం రెండూ ‘భారతీయుడు 2’ రిజల్ట్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే రీషూట్ల వల్ల కొంత, ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం వల్ల ఇంకొంత ‘గేమ్ ఛేంజర్’ తన క్రేజ్‌ని తగ్గించుకొంది. ‘భారతీయుడు 2’ రిజల్ట్ అటూ ఇటూ అయితే… మరింత ఇబ్బంది.
అయితే ‘భాయతీయుడు 2’లో సరికొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ కనిపించేది కాసేపే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘భారయతీయుడు 2’ మొత్తం సిద్దార్థ్ చుట్టూ నడిచే కథ అని, అక్కడక్కడ మాత్రమే కమల్ మెరుస్తాడని తెలుస్తోంది. కమల్ పోర్షన్ అంతా `భారతీయుడు 3` ఉంటుందని, అందుకే ‘భారతీయుడు 2’ పూర్తిగా సిద్దార్థ్ సినిమా అని సమాచారం. నిజానికి ‘భారతీయుడు 3’ తీసే ఉద్దేశం శంకర్‌కు లేదు. కానీ ‘భారతీయుడు 2’ ఫుటేజీ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఒకే సినిమాలో ఇంత ఫుటేజ్ చూపించడం కష్టం. పైగా వ్యాపార లెక్కలు కూడా ఉన్నాయి కదా. మరో భాగం పొడిగిస్తే, బిజినెస్ గిట్టుబాటు అవుతుంది. అందుకే పార్ట్ 3 వైపు మొగ్గు చూపించాడు శంకర్. అలా.. సిద్దార్థ్ పాత్ర నిడివి పెరుగుతూ పోయి, కమల్ పాత్ర తగ్గుతూ వచ్చింది. ముసలి కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చే సరికి ‘భారతీయుడు 2’కు శుభం కార్డు పడిపోతుందని, కమల్ అసలు విశ్వరూపం చూడాలంటే ‘భారతీయుడు 3’ వరకూ ఆగాల్సిందే అని టాక్.