కమల్ హసన్ యూనివర్శల్ స్టార్. సినిమానే ప్రాణంగా బతికిన మనిషి. ఆయన సినిమాలు పెద్ద కమర్షియల్ హిట్స్ కాకపొవచ్చు కానీ కళని అభిమానించే వారిని మాత్రం నిరాశపరచవు. నటుడిగా, దర్శుకుడిగా, నిర్మాతగా .. ఇలా సినిమాలో 24క్రాఫ్టుపైన అభిరుచి వున్న సినిమా మనిషి కమల్. ఇనాళ్లు సినిమాలోనే గడిపిన కమల్.. ఇప్పుడు బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఆయన వస్త్ర వ్యాపారం మొదులుపెడుతున్నారు.
ఖాదీ, చేనేత వస్త్రాల షోరూమ్ ని అమెరికా లో చికాగోలో లాంచ్ చేస్తున్నారు కమల్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రామ్ తో వస్త్రాలని స్పెషల్ గా డిజైన్ చేయించారు. నవంబర్ లో ఓపెనింగ్ వుంటుంది. ఖాదీ మన సాంప్రదాయం. మన చరిత్ర. మన గర్వం. ఖాదీ కళాకారులు పరిశ్రమ విశ్వవ్యాప్తం కావాలి” అని అంటున్నారు కమల్ హాసన్. ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగా వున్నారు కమల్. ఆలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5ని హోస్ట్ చేస్తున్నారు.