భారతీయజనతాపార్టీ ఈ మధ్య కాలంలో ఎమర్జెన్సీనే అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఎప్పుడో ఐదు దశాబ్దాల కిందట ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని ఇప్పటికీ బీజేపీ ప్రచారం చేస్తూ వస్తోంది. ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని కూడా ప్రకటించారు . బీజేపీ నేతల ఆలోచనలకు తగ్గట్లుగానే ఎమర్జెన్సీ ఘటనలను సినిమాగా తీశారు. ఇందులో కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల చేయకపోవడమే మంచిదని బీజేపీ భావిస్తోంది.
ఈ సినిమాలో సిక్కుల్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అది బీజేపీని మరింత ఇరకాటంలో పెడుతుందన్న భావనతో వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. సెన్సార్ బోర్డు నుంచే ఇంకా సర్టిఫికెట్ రాలేదు. సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ పోతున్నారు. హర్యానా ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు సిక్కుల్ని అవమానించేలా సినిమాలు రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
పంజాబీలు.. సిక్కులు ఇప్పటికే బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. కంగనా రనౌత్ విషయంలో రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఇప్పుడు ఆమ బీజేపీ ఎంపీ, రివర్స్ అయితే.. మొత్తంగా బీజేపీకే పెను సమస్యగా మారుతుంది. మామూలుగా అయితే కాంగ్రెస్ ఈ సినిమాను వ్యతిరేకించాలి. వ్యతిరేకిస్తోంది కూడా. కానీ.. బీజేపీ కూడా రిలీజ్ కు ధైర్యం చేయలేకపోవడమే ఇక్కడ ట్విస్ట్.