నటుడు కాంతారావు కుటుంబం కడు పేదరికంలో ఉందంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ..దీనికి సమాజం.. టాలీవుడ్.. ప్రభుత్వానిదే బాధ్యతన్నట్లుగా ఓ వ్యంగ్యమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టారు. తాను పెద్ద తెలంగాణ వాదినని.. చెప్పుకునే ఆయన .. ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేసి ఉండరు. తాను పోస్టు పెట్టడమే సాయమని ఆయన భావిస్తారు. కానీ ఆయన తన పోస్టు ద్వారా ఏం చెప్పాలనుకున్నారంటే… ఆ కుటుంబ పేదరికానికి.. సమాజం… ప్రభుత్వం.. టాలీవుడ్ బాధ్యతని చెప్పాలనుకున్నారు. అలాగే నిందలేశారు. అందరూ… ఆ కుటుంబం అంత కష్టాల్లో ఉంటే.. ఇతరులు ఏం చేస్తున్నారని ఆవేశ పడుతున్నారు ?
టాలీవుడ్లో మునిగిపోయిన వాళ్లు 90 శాతం మంది !
సినీ పరిశ్రమ అంటేనే.. రోలర్ కోస్టర్ రైడ్. కుబేరుల్లా వచ్చి సినినిమాలు తీసి.. ఆఫీసుల్లో పని చేసుకుంటున్న దువ్వాసి మోహన్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు ఉన్నారు. అసలు టాలీవుడ్లోకే కాదు.. సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి 90 శాతం ఫెయిల్యూరే. గెలుపు సాధించి.. ఓడిపోయిన వాళ్లూ ఎంతో మంది ఉన్నారు. ఎవరి గెలుపు ఓటమి వారికే సొంతం. మిగతా వారికి వాటా ఉండదు. ఎవరిది వారు భరించాల్సిందే. నిలబడి ఉన్న వారు.. రేపు తమ పరిస్థితి ఏమైపోతుందో అన్న ఆందోళనలో ఉంటారు. వారు మునిగిపోయినా ఎవరూ పట్టించుకోరు. కళ్ల ముందు అలాంటి ఆధారాలెన్నో ఉన్నాయి.
కాంతారావు గొప్పతనం కుటుంబానికి క్యాష్ రూపంలో ఎందుకు వస్తుంది ?
కాంతారావు గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. ఆయనను పాతతరం ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఆయన గొప్ప నటుడని.. ఆ ఖ్యాతి అంతా.. ఆయన కుటుంబసభ్యులకు క్యాష్ రూపంలో వెల్లువలా రావాలనుకుంటే ఎలా ?. సినీ పరిశ్రమలో ఎందరిలాగో ఆయనకు మొదట కలిసి వచ్చింది.. తర్వాత రాలేదు. సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. చివరి రోజుల్లో ఇబ్బందిపడ్డారు. ఆయన కుటుంబ దుస్థితికి చాలా మంది సాయం చేశారు. తెలంగాణ సర్కార్ కూడా ఆయన భార్య ఉన్నంత కాలం సాయం చేసింది.
ఆయన కుమారులనూ సమాజం పోషించాలనడం కరెక్టేనా ?
కాంతారావు కుమారులు కడు పేదరికంలో ఉన్నారు. దానికి వారే కారణం. ఆయన తండ్రి సంపాదించి ఏమీ ఇవ్వలేకపోవచ్చు..కానీ వారు సంపాదించుకోవచ్చుగా. తమ తండ్రి అందించిన ఘనమైన వారసత్వాన్ని ఎందుకు అందుకోలేకపోయారు…? తన తంద్రి ఇప్పుడు గొప్పగా బతికారని..ఇప్పుడు తమకు సాయం చేయాలని అడగడం .., తమ తండ్రి గౌరవాన్ని తగ్గించడమే. ఇప్పుడు వారిని ఆదుకోవడం లేదని.. సినీ పరిశ్రమను.. ప్రభుత్వాలను.. చివరికి సమాజాన్ని కూడా నిందిస్తున్నారు కొంత మంది సోషల్ మీడియా ఉద్యమకారులు. చేతిలో ఫోనుందని అలా అనేస్తారు.. నిజంగావారుకూడా సాయం చేయరు.
ఈ ప్రపంచంలో బతకాలంటే.. ఎవరి కష్టం వారిదే. కష్టం కాకపోయినా.. తమ పూర్వీకులు సంపాదించిన ఆస్తినో.. పేరుతో పక్కాగా ఉపయోగించుకునే తెలివితేటలయినా ఉండాలి. లేకపోతే బతకడం కష్టం. ఎంత మంది దానాలుచేసినా అవి అంత వరకే ఉంటాయి. అందుకే కాంతారావు కుమారులపై జాలి చూపించడం ఆపేసి.. వారికి సాయం చేయడం లేదని అందిరపై నిందలు నిలిపివేసి.. వారికేదైనా ఉపాధి చూపించే ప్రయత్నం చేయండి