తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో నాలుగు రోజులు వుంటారంటేనే పెద్ద వార్త అయింది.అయితే అందుకు కారణం కంటి చికిత్స అన్న విషయం ఇంగ్లీషు పత్రికలు రాశాకే తెలుగు మీడియా ఇచ్చింది. అయితే లండన్ నుంచి నిపుణులు రావడం ఆలస్యం కావడంతో ఆ చికిత్స వాయిదా పడిందట. ఈ లోగా దంత వైద్యం కూడా చేయించుకోవడం మొదలుపెట్టారట. ఇవన్నీ కలసి ఆయన మరిన్ని రోజులు అక్కడ వుండాల్సి వస్తున్నది. తర్వాత ఎలాగూ రాష్ట్ర సమస్యలు రాజకీయాల కోసం ఒకటి రెండు రోజులు వుంటారు. విదేశీ పర్యటనల సమయంలో తప్ప ఇన్ని రోజులు ముఖ్యమంత్రి రాజధానికి దూరంగా వుండటం జరగదు. కెసిఆర్‌కు గట్టిగానే వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నది దీంతో నిర్ధారణై పోయింది. అవన్నీ సఫలీకృతమై ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుందాం.