తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని.. ఏపీపై కక్షకట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ యాప్లో.. ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం ఉందని.. అదో పెద్ద నేరం అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. నిజానికి అది ఏపీ అంతర్గత వ్యవహారం. అసలు.. తెలంగాణ ప్రభుత్వానికే సంబంధం లేదు. అయినా.. ఏపీలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. దానికి వైసీపీ నేతలు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.
ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం.. అనేది… ఏ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అయినా.. ఉపయోగించుకుంటుంది. అంత ఎందుకు.. తెలంగాణలో కొద్ది రోజుల కిందట.. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార వ్యూహం ఏమిటి..? కేవలం తెలంగాణ ప్రభుత్వ నుంచి లబ్ది పొందిన వారిని నేరుగా.. కలిసి.,. టీఆర్ఎస్కు ఓటేయాలని అడగడం. ఇందులో చాలా ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. ఓటు వేయకపోతే.. ఇప్పుడొచ్చేవి రావని చెప్పడం లాంటి వ్యూహాలు ఉంటాయి. ఈ లబ్దిదారుల సమాచారాన్ని.. నియోజకవర్గాల వారీగా గ్రామాల వారీగా.. టీఆర్ఎస్ క్యాడర్ను.. పంపిణీ చేశారు. ప్రత్యేకంగా సమావేశం పెట్టి మరీ కేసీఆర్.. ఎమ్మెల్యేలకు.. ఈ సమాచారాన్ని ఇచ్చారు. లబ్దిదారులతో ఎలా ఓట్లు వేయించుకోవాలో… రెండు, మూడు గంటలకు క్లాస్ పీకి పంపించారు. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ పత్రికలోనూ వచ్చింది.
ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. అధికార పార్టీగా లబ్దిదారుల సమాచారం తెలుసుకోవడమే తప్పన్నట్లుగా.. ఏపీ వ్యవహారాల్లో వేలు పెట్టి మరీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. నేరుగా ఏపీకి వచ్చి… వైసీపీ కోసం ప్రచారం చేస్తే.. ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో.. హైదరాబాద్లో ఉన్న పరిస్థితులను అడ్వాంటేజ్ చేసుకుని.. ఏపీపై పెత్తనం చేయాలన్న ప్రయత్నాన్ని తెలంగాణ సర్కార్ చేస్తోందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.