కేసీఆర్ ఇటీవల ప్రతీ నెలా కార్యవర్గ సమావేశాలు లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు సమాచారం ఇచ్చి రేపు మీటింగ్ పెట్టేస్తున్నారు. ఆయన ప్రతీ సారి మీటింగ్లో ఏదో చెప్పాలనుకుంటున్నారని .. చెప్పలేకపోతున్నారని అనుకుంటున్నారు. మరోసారి ఆయన ఇలాంటి సమావేశానికి పిలుపునిచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని సమచాారం పంపారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
గత సమావేశంలో అక్టోబర్లో ఎన్నికలు అని..అదరూ రెడీగా ఉండాలన్నట్లుగా పిలుపునిచ్చారు. కానీ డిసెంబర్ మొదటి వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా.. ఒక్క తెలంగాణకే విడిగా ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. కాబట్టి..త కేసీఆర్ చెప్పినట్లుగా నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం లేదంటున్నారు. అయితే ఈ సారి టిక్కెట్లు ఇవ్వకూడదని డిసైడ్ అయిన నేతలకు… సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది.