ఇటీవల జరిగిన పరిటాల శ్రీరాం పెళ్ళీకి హాజరైన కెసిఆర్అ క్కడ పరిటాల రవి సమాధిని కూడా దర్శించిన విషయం తెలిసిందే అయితే, ఈ విషయాన్ని విపక్షాలు రాజకీయం చేస్తునాయని వాటి మీద విరుచుకుపడ్డారు కెసియార్.
తాను అప్పట్లో అనంతపురం ఇన్-చార్జ్ మంత్రి గా ఉన్న విషయాన్ని, అందులో భాగంగా సహచర మంత్రి అయిన పరిటాలతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసారాయన. అలాగే అప్పట్లో వాళ్ళ ఇంటికి వెళితే పరిటాల, భార్యా పిల్లలు, ఇంట్లో అన్నం పెట్టి, ఆత్మీయంగా చూసుకున్నారని చెప్పారు. అలాంటిది ఆమె ఇప్పుడు ఇంటికి వచ్చి, “అన్నా, ఆయన లేరు. పిల్లల పెళ్ళి పెట్టుకున్నాను, మీరు తప్పకుండా రావాలి” అని పిలిస్తే పెళ్ళికి వెళ్ళాను. దాన్ని కూడా రాజకీయమ చేస్తే ఎలాగండీ అంటూ విరుచుకుపడ్డారు కెసిఆర్. ఇక పరిటాల చనిపోయినప్పుడు తాను వెళ్ళలేకపోయానని, అందుకే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన సమాధి దర్శించుకుని దాని మీద పూలు పెట్టానని, ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
అయినా కెసిఆర్అ న్నట్టు, “పెళ్ళి, చావు – ఇలాంటి విషయాల్లో రాజకీయాలు ఉండొద్దు”. మరి ఈ విషయం కూడా తెలీకుండా ఎందుకు విమర్శలు చేస్తారో కొందరు నాయకులు.