గవర్నర్‌పై ఆవేశంగా హైకోర్టుకెళ్లిన తెలంగాణ సర్కార్ చివరికి ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలని తెలుసుకుది. ఇంత కాలం గవర్నర్ విషయంలో చేస్తున్నదంతా తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చినట్లయింది. హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్ ను ఉపసంహరించుకుని గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఊహించలేని ఘటనలు ఈ ఉదయం నుంచి వరుసగా జరిగిపోయాయి.
మూడో తేదీన అసెంబ్లీని సమావేశపరిచి.. అదే రోజు బడ్జెట్ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. కానీ గవర్నర్ .. మాత్రం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని తిరుగు ప్రశ్నతో లేఖ పంపారు. దీంతో బడ్జెట్ ఆమోదించరని డిసైడయి.. కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వం. నిజానికి ఇది హైకోర్టు విచారించే విషయం కాదు. గవర్నర్ ను హైకోర్టు ఆదేశించలేదు. అలాగే.. గవర్నర్ ప్రసంగం పెట్టాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించలేదు. అయినప్పటికీ ఏ న్యాయసలహాదారుడు సలహా ఇచ్చారో కానీ తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది.
పిటిషన్ పరిశీలన స్థాయిలోనే ఈ పిటిషన్ ను ఎలా విచారించగలమని.. హైకోర్టు ప్రశఅనిస్తే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చునని ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే చెప్పకొచ్చారు. దీంతో హైకోర్టు అనమతించిది. కానీ వాదనల్లో అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ప్రభుత్వమేనన్నట్లుగా తేలే సూచనలు కనిపించడంతో .. అది మరీ డేంజర్ కావడంతో వెంటనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. పిటిషన్ వెనక్కి తీసుకుంటామని.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు దవే తెలిపారు.అంతే కాదు గవర్నర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తానన్నార.ు
ప్రభుత్వం ఒక్క సారిగా గవర్నర్ కు సరెండర్ అయినట్లుగా వ్యవహిరంచడంతో బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇంత దానికి హైకోర్టు దాకా ఎందుకు వెళ్లడం అని.. ముందే … గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెబితే.. ఇక్కడిదాకా సమస్య వచ్చేది కాదు కదా అన్న నిట్టూర్పు వినిపిస్తోంది.