కేసీఆర్నే తమ నాయకుడిగా ఎంచుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిసైడయ్యారు. కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అసెంబ్లీకి రారు. మిగిలిన వారంతా శనివాసం అసెంబ్లీ హాల్లో సమావేశం అవుతున్నారు. ప్రమాణం స్వీకారానికి హాజరవుతారు. అంతకు ముందే పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంచుకోవాలని డిసైడయ్యారు. కేసీఆర్ ఇక అసెంబ్లీకి రారని ..ప్రతిపక్ష నేతగా ఉండరని.. వేరే వారికి బాధ్యతలిస్తారన్న ప్రాచరం జరిగింది.
కానీ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా తానే ఉంటానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన పేరు టెక్నికల్ గానే ఉంటుందని చెబుతున్నారు. ఆయన ఇప్పుడల్లా అసెంబ్లీకి హాజరయ్యే పరిస్థితి లేదు. అసెంబ్లీలో సమావేశాలు జరిగితే.. ఉపనేతలుగా ఎన్నికయ్యే వారు బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారికంగా ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆరే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకయాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ ఉండటమే మంచిదన్న వాదన ను కొంతమంది సీనియర్ నేతలు వినిపించినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ కూడా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాగూ.. జాతీయ రాజకీయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నందున… అప్పుడే ఎమ్మెల్యే పదవికి.. ప్రతిపక్ష నత పదవికి కూడా రాజీనామా చేయవచ్చునని.. ఇప్పటికైతే తానే ఉండటం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆయనను ఎన్నుకున్నాకేటీఆర్ మిగతా వ్యవహారాలను నడిపించే అవకాశం ఉంది.