తెలంగాణ రాష్ట్ర సమితికి ఇటీవల కొంత మంది సీనియర్లు గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ వారు వెళ్లిపోయేటప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం వారందర్నీ పార్టీలోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్తో కేసీఆర్ స్వయంగా మాట్లాడి మళ్లీ పార్టీలోనే ఉండేలా చేశారు. సాధారణంగా పార్టీని ధిక్కించిన ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వని కేసీఆర్… రవీందర్ సింగ్ను మాత్రం ప్రగతి భవన్కు అహ్వానించారు. దీంతో రవీంద్ సింగ్ మెత్తబడ్డారు. కేసీఆర్ వెంటే నడుస్తానన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఉద్యమ నేపధ్యం ఉన్న వారు కేసీఆర్కు దూరమయ్యారు. కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి, స్వామి గౌడ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి, విజయరామారావు, ఏ.చంద్రశేఖర్, బాబుమోహన్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, తుల ఉమ, గట్టు రాంచందర్ రావు ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోయారు. వీళ్లలో తిరిగి వచ్చే వారి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరిన నేతలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉద్యకారులు, టీఆర్ఎస్ అంతృప్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ కసరత్తు చేస్తుండటంతో ఎక్కడ పార్టీని వీడతారోనని నామినేటెడ్ పదవులను కూడా టీఆర్ఎస్ హైకమాండ్ ఇస్తోంది. ఉద్యమంలో పనిచేసిన నేతలను గుర్తించి కట్టబెడుతోంది. కేసీఆర్ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి !