తెలంగాణ సీఎం కేసీఆర్ కేజ్రీవాల్‌తో భేటీకి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రత్యేక బృందంతో ఢిల్లీకి వెళ్తున్నకేసీఆర్ మంగళవారం ఉదయం ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు. ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా కేజ్రీవాల్‌తో సమావేశం అవుతున్నారు. గతంలో ఎప్పుడు ఆయనతో సమావేశం అయ్యే ప్రయత్నం చేయలేదు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు జరుపుతున్నప్పుడు కేసీఆర్ కూాడా కొన్ని పార్టీలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్లినా ఆయనకు కనీసం సంఘిభావం చెప్పలేదు . దీంతో అప్పుడే కేసీఆర్ బీజేపీ కోసం ధర్డ్ ఫ్రంట్ అంటున్నారని..కాంగ్రెస్ మిత్రపక్షాలను మాత్రమే కలుస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రాజకీయం మారింది కాబట్టి బీజేపీ మిత్రపక్షాలను కూడా కలవాలని కేసీఆర్ డిసైడయినట్లుగా కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ పై చర్చల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఢిల్లీ కి వెళ్లి చర్చలు జరిపి రావాలని డిసైడయ్యారు.
ఢిల్లీలో కేజ్రీవాల్‌తో భేటీతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులతోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కుదిరితే బీహార్ సీఎం నితీష్‌ను కూడా కలుస్తారని చెబుతున్నారు. బయటకు చెప్పకపోయినా కొన్ని రహస్య సమావేశాలు ఢిల్లీలో ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి కేసీఆర్ పర్యటన తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఉంటుందని కొంత మంది అంచనా వేస్తున్నారు.