మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చివరికి ఆయన తిరిగి వస్తారనుకున్న రోజున బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కలిశారు. ఆయనతో పాటు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కూడా కలిశారు. అయితే సుబ్రహ్మణ్యస్వామితో ధర్డ్ ఫ్రంట్ రాజకీయాలపై చర్చించే అవకాశం లేదు. అలాగే రాజకీయాలతో సంబంధం లేని రాకేష్ టికాయత్ తో కూడా మూడో కూటమిపై చర్చించే అవకాశం లేదు. కానీ వారిద్దరూ కలిసే కేసీఆర్‌తో సమావేశయ్యారు. వారితో కలిసి కేసీఆర్ లంచ్ కూడా చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి వచ్చే జూన్‌తో రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది.
ఆయనను ఇప్పటికే బీజేపీ వదిలించుకుంది. ఆయన తనకు రాజ్యసభ సీటు ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్నాళ్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ అవకాశం ఇస్తారమో అని చూశారు. కానీ జగన్ వైపు నుంచికూడా స్పందన లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఓ సారి మమతా బెనర్జీని పొగుడుతారు. మరో సారి మరో నేతను పొగుడుతారు. అన్నీ రాజ్యసభ సీటు కోణంలోనే. కానీ ఎవరూ ఆయనను ప్రోత్సహించడం లేదు. తాజాగా ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఎదుట రాజ్యసభ ప్రతిపాదన పెట్టారో లేదో స్పష్టత లేదు కానీ..,ాయన టార్గెట్ మాత్రం అదేనని సుబ్రహ్మణ్య స్వామి ప్రయత్నాల గురించి తెలిసిన వాళ్లు చెబుతూంటారు.
ఇక రాకేష్ టికాయత్.. సీఎం కేసీఆర్ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి కేసీఆర్ నష్టపరిహారం ప్రకటించారు. బహుశా వాటి పంపిణీ గురించి చర్చించిఉంటారని భావిస్తున్నారు. చనిపోయన వారి లిస్ట్‌ను టికాయత్ వద్ద నుంచేతీసుకుంటానని కేసీఆర్ ప్రకటించారు. ఈ కారణంతో కేసీఆర్‌తో భేటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ఢిల్లీలో ఉన్న నాలుగు రోజుల్లో భేటీ అయింది సుబ్రహ్మణ్య స్వామి, టికాయత్‌తో మాత్రమే.